డైరెక్టర్ తో గొడవపై క్లారిటీ ఇచ్చిన జగపతిబాబు

July 19, 2019 at 3:48 pm

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు అలియాస్ జ‌గ్గూబాయ్‌తో త‌న‌కు చెడ‌లేదంటున్నాడు ఓ యువ‌ద‌ర్శ‌కుడు… జ‌గ్గూబాయ్‌పై ఈ మ‌ద్య కాలంలో వ‌స్తున్న పుకార్ల‌న్ని నిజాలు కాదంటున్నాడు ఆ ద‌ర్శ‌కుడు. సోష‌ల్ మీడియాలో జ‌గ్గూబాయ్ పై వ‌స్తున్న పుకార్ల‌కు ఆ యువ‌ద‌ర్శ‌కుడు సోష‌ల్ మీడియా వేదిక‌గానే పుల్‌స్టాప్ పెట్టాడు. ఇంత‌కు ఈ యువ ద‌ర్శ‌కుడు చేసిన పోస్టింగ్‌పై జ‌గ్గూబాయ్ ఎమంటాడో చూద్దాం.. అంత‌క‌న్నా ముందు జ‌గ్గూబాయ్ గురించి ఆ యువ ద‌ర్శ‌కుడు ఏమ‌న్నాడో చూద్దాం…

జ‌గ్గూబాయ్ ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకున్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే అటు జ‌గ్గూబాయ్ కానీ, ఇటు స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర‌యూనిట్ కాని ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయాలేదు. దీంతో ఏది నిజ‌మో ఏది అబ‌ద్దమో అభిమానుల‌కు తెలియ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నిజ‌మేన‌ని తేలింది. స‌రిలేరు నీకెవ్వ‌రు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి జ‌గ్గూ బాయ్ సినిమా నుంచి త‌ప్పుకుంది నిజ‌మేన‌ని ఒప్పుకున్నాడు.

ఇంత‌కు జ‌గ్గూబాయ్‌కి సినిమా నుంచి త‌ప్పుకోవడం ఏమాత్రం ఇష్టం లేద‌ట‌. ఇందులో న‌టించ‌డానికి చాలా ఆస‌క్తి చూపాడు.. కానీ కొన్ని అనివార్య కార‌ణాల‌తో ఆయ‌న ఈ సినిమాలో న‌టించ‌డం లేదు. ఈ సినిమాలో ఆయ‌న త‌న పాత్ర‌ను ప్రేమించారు… కానీ భ‌విష్య‌త్‌లో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని కోరుకుంటున్నాను… మ‌మ్మ‌ల్ని అర్థం చేసుకున్నందుకు జ‌గ‌ప‌తిబాబు గారికి కృతజ్ఞ‌త‌లు తెలిపాడు అనిల్ రావిపూడి… సో ఈ సినిమా నుంచి జ‌గ‌ప‌తి బాబు త‌ప్పుకోవ‌డానికి ప్ర‌ధాన కారణం ఏమై ఉంటుంది… అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స‌రిలేరు నీకెవ్వ‌రూలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరోగా, లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు.

డైరెక్టర్ తో గొడవపై క్లారిటీ ఇచ్చిన జగపతిబాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts