ఎన్టీఆర్ స్టైల్లో క‌ళ్యాణ్‌రామ్‌… స‌క్సెస్ అవుతాడా..

July 20, 2019 at 10:21 am

ప‌టాస్ సినిమా త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్‌కు చాలా లాంగ్ గ్యాప్‌లో హిట్ ఇచ్చిన సినిమా `118`. ఈ ఏడాది వ‌చ్చిన ఈ సినిమాతో క‌ళ్యాణ్ రామ్ మ‌ళ్లీ ఫామ్‌లో ప‌డ్డాడు. గత కొంతకాలంగా చాలా వీక్ గా ఉన్న కళ్యాణ్ రామ్ మార్కెట్ 118తో కాస్త ట్రాక్‌లోకి వ‌చ్చింది. 118 జోష్‌తో ప్ర‌స్తుతం మంచి క‌థ‌లు ఎంపిక చేస్తుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే క‌ళ్యాణ్ ఎన్టీఆర్ య‌మ‌దొంగ‌ త‌ర‌హాలో ఫాంటసీ జానర్‌లో కొత్త క‌థ ఎంచుకోబోతున్నాడ‌ని టాక్‌.

ఓ డెబ్యూ డైర‌క్ట‌ర్ దేవలోకాలు భూమిని కనెక్ట్ చేస్తూ ఓ కొత్త లైన్ చెబితే దానికి బాగా ఇంప్రెస్ అయిన క‌ళ్యాణ్‌ రామ్ ఇలాంటి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ స్టోరీలో న‌టించేందుకు సక్తి చూపిస్తున్నాడ‌ట‌. ఫాంటసీ అంటే అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి కాబట్టి చాలా కసరత్తే అవసరం. ఈ సినిమాను సొంతంగా నిర్మించ‌డానికి రెడీగా ఉన్న‌ట్టు టాక్‌. అయితే ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ చేస్తున్న ఎంత మంచివాడురా త‌ర్వాత ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది.

అయితే దేవ‌లోకాల కాన్సెఫ్ట్ కావ‌డంతో ఈ సినిమా బ‌డ్జెట్ భారీగా ఉండ‌డంతో దాని గురించి ఆలోచ‌న‌లు న‌డుస్తున్నాయ‌ట‌. కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మి క‌ళ్యాణ్ రామ్ భారీ బ‌డ్జెట్ పెడితే ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతారు ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. గ‌తంలో ఇదే త‌ర‌హాలో ఓం సినిమా చేసి నిండా మునిగిపోయాడు. 118 సినిమాతో ఇప్పుడిప్పుడే ఫామ్‌లో ప‌డ్డ క‌ళ్యాణ్ రామ్ రిస్క్ చేసి కొత్త త‌ర‌హాలో ఫాంటసీ జానర్ స్టైల్లో చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న సందేహాలున్నా… క‌ళ్యాణ్ క‌థ‌ను న‌మ్మి సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

ఎన్టీఆర్ స్టైల్లో క‌ళ్యాణ్‌రామ్‌… స‌క్సెస్ అవుతాడా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts