కొర‌టాల శివ సినిమాలో చిరు లుక్ ఇదేన‌ట‌…

July 4, 2019 at 11:01 am

మెగాస్టార్ చిరంజీవి త‌దుప‌రి 152వ చిత్రంలో న‌టించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి కొర‌టాల శివ‌తో చేసే సినిమాలో కౌబాయ్‌లా క‌నిపించాల‌ని కండిష‌న్ పెట్టడంతో చిరంజీవి ఇప్పుడు కౌబాయ్‌గా కావాలని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ ప్ర‌య‌త్నంలో చిరంజీవి ఇంత‌కు ముందు ఉన్న‌ట్లుగా బొద్దుగా కాకుండా స్లిమ్‌గా త‌యార‌య్యాడు. 

మెగాస్టార్ చిరంజీవి స్లిమ్‌గా అయిన లెటెస్ట్ ఫోటోల‌ను ఇప్పుడే త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఈ లుక్‌లోనే చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాలో క‌నిపిస్తాడ‌నే టాక్ న‌డుస్తుంది. ఈ ఫోటోలో చిరంజీవి పాత చిరంజీవికి పోలికే లేకుండా ఉంది. సైరా సినిమా చిరంజీవికి, ఇప్పుడు చూస్తున్న చిరంజీవికి చాలా వ్య‌త్యాసం ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ఓవైపు కొర‌టాల శివ సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల బిజిలో ఉంటే మెగాస్టార్ జిమ్‌లో కుస్తీలు ప‌డుతున్నాడ‌ట‌.

మొగ‌ల్తూరు మొన‌గాడు మెగాస్టార్ చిరంజీవి పాత కాలం చిరంజీవిగా కావాల‌ని కొర‌టాల శివ ఆదేశించ‌డం చిరంజీవి అక్ష‌రాలు పాటించ‌డం జ‌రుగుతుంద‌ని ఈ ఫిక్స్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని అభిమానులు అంటున్నారు. అయితే చిరంజీవి కౌబాయ్‌గా మార‌డానికి జిమ్‌లో నానాయాత‌న ప‌డుతున్నాడు. బాలీవుడ్‌లో కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ట్రైన‌ర్ ఆధ్వ‌ర్యంలో చిరంజీవి ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ కోసం, కౌబాయ్‌గా మార‌డానికి కావాల్సిన క‌స‌ర‌త్తులు రాత్రింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ట‌. సో ఇప్పుడు చిరంజీవి లీక్ చేసిన లుక్స్ కొర‌టాల శివ సినిమాకు కోస‌మే అనేది స‌త్యం.

కొర‌టాల శివ సినిమాలో చిరు లుక్ ఇదేన‌ట‌…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts