ఏపీ రాజ‌కీయాల్లో `ఆద‌ర్శం` కోటగిరి

July 17, 2019 at 11:34 am

రాజ‌కీయాల్లో `ఆద‌ర్శం` అనే మాట‌కు అర్థం కూడా తెలియ‌కుండా పోయిన రోజులు ఇవి. అవ‌స‌రం-అవ‌కాశం ప్రాతిప‌దిక‌గా నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీలు ఏవైనా.. నాయ‌కులు మాత్రం తాము నిర్ధేశించుకున్న మార్గంలోనే న‌డుస్తున్నారు. అయితే, ఇలాంటి వ్య‌క్తిగ‌త‌ రాజ‌కీయాల్లోనూ మేలిమి ర‌త్నాల్లాంటి నాయ‌కుడు మ‌న‌కు అప్పుడ‌ప్పుడు తార‌స‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇలాంటి వారి వ‌ల్లే ఇంకా రాజ‌కీయాలు ఇక మ‌న‌గ‌లుగుతున్నాయి . ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఏలూరు ఎంపీగా తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన యువ నాయ‌కుడు, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన కోట‌గిరి విధ్యాధ‌ర‌రావు వార‌సుడు కోట‌గిరి శ్రీ‌ధ‌ర్ కూడా ఆద‌ర్శ‌వంత‌మైన రాజ‌కీయాలు చేస్తున్నందునే!!

భారీ మెజారిటీ వ‌చ్చినా…
రాజ‌కీయ ఉద్ధండుడైన త‌న తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రాజ‌కీయాల్లో వ‌చ్చారు కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌. విద్యావంతుడైన శ్రీ‌ధ‌ర్ తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ టీకెట్‌పై ఏలూరు నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌తి ప్రాంతాన్ని సంద‌ర్శించారు. జ‌గ‌న్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకున్నారు. పార్టీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. త‌న గెలుపుతోపాటు జ‌గ‌న్‌ను సీఎంను చేయాల‌నే ఏకైక లక్ష్యంతో శ్రీ‌ధ‌ర్ చేసిన తొలి ప్ర‌య‌త్నంలోనే ప్ర‌జ‌లు ఆయ‌నను భారీ మెజారిటీతో ఆశీర్వ‌దించారు. టీడీపీ నుంచి మాగంటి బాబు వంటి సీనియ‌ర్ నాయ‌కుడిని ఓడించి దాదాపు ల‌క్షా 65 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. నిజానికి ఇంత భారీ మెజారిటీ 2014లో ఇక్క‌డ నుంచి గెలిచిన టీడీపీ నాయ‌కుడు మాగంటికి కూడా రాక‌పోవ‌డం గమ‌నార్హం

అందరితోనూ క‌లిసి మెలిసి సామాన్యుడిగా….
ఇక‌, ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశంతో ఏ నాయ‌కుడైనా ప‌ల్ల‌కిల్లో తిరిగే వెసులుబాటు ఉంటుంది. అయితే, కోట‌గిరి శ్రీ‌ధ‌ర్ మాత్రం అలా అనుకోలేదు. అత్యంత సామాన్యుడిగా అంద‌రిలోనూ క‌లిసి పోతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఎలా ప్ర‌జ‌ల్లో ఉన్నారో.. ఇప్పుడు గెలిచిన త‌ర్వాత కూడా అదే రేంజ్‌లో ప్ర‌జ‌ల్లో సామాన్యుడిగా ఉన్నారు. అన్ని వ‌ర్గాల వారితోనూ స్నేహంగా మ‌సులుతున్నారు. రైతులు, యువ‌త‌, ఉద్యోగులు ముఖ్యంగా విద్యార్ధులు, అట్ట‌డుగు వ‌ర్గాల వారు ఇలా అన్ని వ‌ర్గాల‌తోనూ తాను క‌లిసిపోతూ వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. అంద‌రిలో ఒక‌డిగా వారి క‌ష్టాలు తెలుసుకుంటూ.. వాటిని ప‌రిష్క‌రించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అన్ని మాధ్య‌మాల్లోనూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. సోష‌ల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు. దీంతో గ‌తానికి ఇప్ప‌టికీ రాజ‌కీయంగా వ‌చ్చిన మార్పును చూసి ఏలూరు ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓ ఎంపీగా ఉన్నా శ్రీథ‌ర్ సామాన్యుడిగా ప్ర‌జ‌ల్లో క‌లిసిపోవ‌డాన్ని పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు.

స‌ర్‌ప్రైజ్ విజిట్లు….
తాజాగా ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ట్లూరు గ్రామంలో ప్ర‌భుత్వ ఆధ‌ర్యంలో స‌డుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక‌ల పాఠ‌శాల‌లో ప‌ర్య‌టించారు. విద్యార్థినుల‌తో క‌లిసి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారికి వండి వ‌డ్డిస్తున్న ఆహారాన్ని స్వ‌యంగా రుచి చూశారు. నాణ్య‌త బాగుండాల‌ని సిబ్బందికి సూచించారు. అదే స‌మ‌యంలో పాఠ‌శాల‌లో వారికి అందుతున్న వ‌స‌తుల‌ను కూడా తెలుసుకున్నారు. ఇక‌, విద్య నాణ్య‌త ఎలా ఉందో స్వ‌యంగా విద్యార్థుల‌ను ప్ర‌శ్నించి తెలుసుకున్నారు. నేటి విద్యార్థులే రేప‌టి పౌరులని, వారికి ప్ర‌భుత్వం నుంచి మ‌రింత సాయం, మౌలిక సదుపాయాలు, నాణ్య‌మైన విద్య అందించేందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా కోట‌గిరి శ్రీ‌ధ‌ర్ పేర్కొన్నారు. కాగా, ఎంపీ కోట‌గిరి రాక‌తో విద్యార్థినులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌తో క‌లిసి సెల్ఫీలు దిగారు.

ఫామాయిల్ రేటుపై ప్ర‌త్యేక దృష్టి :
ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌లేషియా త‌ర్వాత ఎక్కువ ఫామాయిల్ సాగు అవుతోంది భారత దేశం నుండి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో మాత్రమే … అధిక దిగుబ‌డి వ‌స్తోంది శ్రీథ‌ర్ ప్రాధినిత్యం వ‌హిస్తోన్న ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే… ఈ క్ర‌మంలోనే ఈ ప్రాంతంలో వేలాది ఎక‌రాల్లో ఫామాయిల్ సాగు చేస్తోన్న రైత‌లు బాధ‌ల‌ను గ‌త పాల‌కులు ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు మిన‌హా వీరి సాధ‌కబాధ‌కాలు ఆరా తీసిన వారే లేరు. పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌కు ఆంధ్ర ప్రదేశ్లో ఫామాయిల్ ట‌న్నుకు రూ.700 తేడా ఉండ‌గా.. శ్రీధ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే ఫామాయిల్ రేటు పెంచేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నిక‌లు అవ్వ‌గానే సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో ప్ర‌త్యేకంగా మాట్లాడి రేటు పెరిగేలా చేశారు. దీంతో ఇప్పుడు స్టేట్‌లో ఉన్న ఫామాయిల్ రైతులంద‌రూ శ్రీధ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఏదేమైనా ఓ సీనియ‌ర్ పొలిటిక‌ల్ ఫ్యామిలీ వార‌సుడిగా సామాన్య పాల‌న‌తో శ్రీధ‌ర్ ముందుకు వెళుతోన్న తీరు మెచ్చుకోత‌గ్గ‌ది.

ఏపీ రాజ‌కీయాల్లో `ఆద‌ర్శం` కోటగిరి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts