మ‌హేష్‌కు పూరికి ఎక్క‌డ చెడింది…!

July 20, 2019 at 12:35 pm

తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్` ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ బాబుపై చేసిన కామెంట్లు చాలా కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. ఇవ‌న్నీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్‌లో పూరీపై ఆగ్ర‌హం నెల‌కొంది. మ‌హేష్ ఫ్యాన్స్ పూరీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మ‌హేష్ బాబు- పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన `పోకిరి` సినిమా బ్లాక్‌బాస్ట‌ర్ అయింది. అటు పూరీ, మ‌హేష్ ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ఈ సినిమా వీరిద్ద‌కి స‌క్సెస్‌ను అందించింది.

ఆ త‌ర్వాత వీరి ఇద్ద‌రి కాంబోలో `బిజినెస్‌మ‌న్` వ‌చ్చింది. ఈ సినిమా సైతం మంచి వ‌సూళ్లు సాధించి వీరి కాంబోలో వ‌రుస‌గా రెండో హిట్‌గా నిలిచింది. మ‌హేష్ బాబు `బిజినెస్‌మ‌న్‌` త‌ర్వాత పూరీతో ఎప్పుడైనా సినిమా చేస్తాన‌ని ఎన్నోసార్లు అన్నారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య ఆ సంభాష‌ణ రాలేదు. అయితే ఆ త‌ర్వాత‌ పూరీ మ‌హేష్‌తో `జ‌న‌గ‌న‌మ‌ణ‌` సినిమా చేస్తాన‌ని ప్ర‌చారం చేశారు.

పూరీ టైమ్ బాగోక.. మ‌హేష్ ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ సినిమా కోసం మూడేళ్లుగా ఎద‌రు చూస్తున్నారు. ఈ లోగా ఒక్క హిట్‌తో ఫ్రూవ్ చేసుకుందామ‌నుకున్న పూరి ఏకంగా ఆరు ప్లాపులు ఇచ్చాడు. దీంతో ఓ మోస్త‌రు హీరోలు కూడా పూరికి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని పరిస్థితి. అయితే `ఇస్మార్ట్` ఇంట‌ర్వ్యూలో మహేష్‌పై పూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో సెటైర్ వేశాడు.

పూరీ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు స‌క్సెస్ లేద‌ని.. స‌క్సెస్ అయితేనే మ‌హేష్ నాతో సినిమాకు ఓకే చెప్తాడ‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ అయితే మ‌హేష్ ఓకే చేస్తాడా ? అని అడిగితే.. నాకు ఓ క్యారెక్ట‌ర్ ఉందిగా అంటూ ఘాటుగా సెటైర్ వేశారు. దీంతో మ‌హేష్‌ ఫ్యాన్స్ పూరీపై విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌కు పూరి ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు మ‌హేష్ ప‌ట్టించుకోక‌పోవ‌డమే కార‌ణంగా తెలుస్తోంది.

మ‌హేష్‌కు పూరికి ఎక్క‌డ చెడింది…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts