మ‌రో వివాదంలో ష‌మీ… ఆ ఎస్ఎంఎస్ మీనింగ్ ఏంటి…!

July 10, 2019 at 10:52 am

భార‌త క్రికెట్ జ‌ట్టు ఫేస్‌బౌల‌ర్ మహ్మద్ షమీ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. షమీ తనకు మెసేజ్ చేస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ష‌మీ ఓ వైపు ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. మ‌రో పేస్‌బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్‌కుమార్ గాయ‌ప‌డ‌డంతో జ‌ట్టులోకి వ‌చ్చిన ష‌మీ ఏకంగా మూడు మ్యాచ్‌ల‌లో 13 వికెట్లు తీశాడు.

ఇక ష‌మీ వ్య‌క్తిగ‌తంగా వివాదాల్లో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది నెలల క్రితం షమీ గురించి అతని భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. షమీతో పాటు అత‌డి కుటుంబ స‌భ్యులు ష‌మీని తీవ్రంగా వేధిస్తున్నార‌ని.. అత‌డికి చాలా మంది అమ్మాయిల‌తో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై జ‌హాన్ కేసు పెట్ట‌డంతో పోలీసులు అత‌డిపై చార్జ్‌షీట్ కూడా న‌మోదు చేశారు.

అక్క‌డితో ఆగ‌ని ఆమె ష‌మీ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించింది. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీసీసీఐ ముందుగా ష‌మీకి కాంట్రాక్ట్ నిరాక‌రించినా చివ‌ర‌కు విచార‌ణ జ‌రిపి క్లీన్‌చీట్ ఇచ్చి వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక‌చేసింది. ఇదిలా ఉంటే ష‌మీ తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు. త‌న‌కు పరిచయం లేని షమీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనకు పదేపదే మెసేజ్‌లు పంపిస్తున్నాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘1.4 మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్న గొప్ప క్రికెటర్‌ నాకే ఎందుకు మెసేజ్‌ చేస్తున్నాడో ఎవరైన చెప్పగలరా?’ అని మెసేజ్‌ స్క్రీన్‌ షాట్స్‌ జత చేసి ప్రశ్నించింది. దీంతో అత‌డి భార్య జ‌హాన్ గ‌తంలో ష‌మీకి చాలా మంది అమ్మాయిల‌కు లింక్ పెట్టి చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్పుడు సోఫియా చేసిన వ్యాఖ్య‌లు చూస్తే ష‌మీపై ప‌లు అనుమానాలు క‌లుగుతున్నాయి. మ‌రి ఈ వివాదం నుంచి ష‌మీ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో ? చూడాలి.

మ‌రో వివాదంలో ష‌మీ… ఆ ఎస్ఎంఎస్ మీనింగ్ ఏంటి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts