విక్ర‌మ్ ‘ మిస్ట‌ర్ కెకె ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌

July 19, 2019 at 12:09 pm

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్‌ ఇటీవల వరుస ఫ్లాపులతో కెరీర్లో లో తీవ్రంగా సతమతమౌతున్నాడు. ఈ క్రమంలోనే మిస్టర్ కేకే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్‌ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రాజేష్ సెల్వ దర్శకత్వంలో లో తెరకెక్కిన కోలీవుడ్‌లో కదరమ్‌ కొండన్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులో మిస్టర్ కేకే పేరుతో రిలీజ్ అయింది. కంప్లీట్‌ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షర హాసన్ – అభి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ అయిందో లేదో ప్రీమియర్ షో టాక్ ద్వారా తెలుసుకుందాం.

సినిమా కథా పరంగా చూస్తే మలేషియాలో ఓ గ్యాంగ్ హీరో విక్రమ్‌పై ఎటాక్‌ చేస్తారు. ఇదే టైమ్‌లో అక్షర హాసన్ కూడా తన భర్తతో కలిసి అక్కడే ఉంటుంది. ఆమె గ‌ర్భ‌వ‌తి. దాడిలో గాయపడ్డ విక్రమ్‌ని అక్షర భర్త సేవ్ చేసి హాస్పటల్లో చేరుస్తాడు. అదే టైంలో అక్షరహాసన్ కిడ్నాఫ్‌కు గురవుతుంది. పోలీసులు విక్రమ్ ఈ కిడ్నాఫ్ చేశాడ‌ని… అత‌డి గ్యాంగ్ వాళ్లు విక్రమ్ ని హాస్పటిల్ నుంచి సేవ్ చేయటానికి ఈ పని చేశారని నమ్ముతాడు. అక్షర భర్తనే ఈ కిడ్నాప్ కు వాడుకుంటారు.

ఇంత‌లో పోలీస్ అధికారి లీనా చ‌నిపోతుంది. ఈ టైంలో అక్ష‌ర భ‌ర్త పోలీసుల‌కు విక్ర‌మ్ గురించి ఊహించని హింట్ ఇస్తాడు. సెకండాఫ్‌లో అస‌లు ట్విస్ట్ రివీల్ అవుతుంది. విక్ర‌మ్‌ను ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇరికించేందుకు పోలీసు ట్రై చేస్తుంటాడు. ఆ క్రమంలో పోలీసుల‌ నుంచి విక్రమ్ తప్పించుకుపోతాడు. తాను త‌ప్పుచేయ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకునే సాక్ష్యం అత‌డి ద‌గ్గ‌ర ఉంటుంది. దీనిని నాశ‌నం చేసేందుకు పోలీసులు ట్రై చేస్తుంటారు.

ఈ సినిమా ఫైన‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచింద‌న్న టాక్ వ‌చ్చింది. క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో వ‌చ్చిన ఈ సినిమాను క‌మ‌ల్‌, విక్ర‌మ్ ఎందుకు ఓకే చేశార‌ని కూడా విమ‌ర్శ‌కులు ఆడేసుకుంటున్నారు. ఫైన‌ల్‌గా విక్ర‌మ్ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ చేరిన‌ట్టే.

విక్ర‌మ్ ‘ మిస్ట‌ర్ కెకె ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts