హై అలెర్ట్ :నాగార్జున సాగర్ డ్యామ్ కు ఉగ్ర ముప్పు !

July 17, 2019 at 5:58 pm

నాగార్జున సాగ‌ర్ ఇది తెలుగు రాష్ట్రాల‌కు ఓ వ‌ర‌ప్ర‌దాయ‌ని. ఈ ప్రాజెక్టు తెలుగు ప్ర‌జ‌ల‌కు తాగునీరు, సాగునీరు అందిస్తూ ఓ అమృత భాండాగారంగా మారింది. అలాంటి నాగార్జున సాగ‌ర్‌కు ఇప్పుడు ఉగ్ర‌ముప్పు పొంచి ఉందా..? అంటే అవునంటున్నారు ఇంట‌లిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులు. ఇంత‌కు ఈ ప్రాజెక్టుకే ముప్పు ఉందా లేక మ‌రేదైనా ప్రాజెక్టుల‌కు కూడా ఉందా అంటే ఇంకా అనేక ప్రాజెక్టుల‌ను ఉద్ర‌వాదులు టార్గెట్ చేశార‌ట‌.

ఇంట‌లిజెన్స్ బ్యూరో దేశంలోని సుమారు 20 రాష్ట్రాల్లో ఉద్ర‌ముప్పు పొంచి ఉంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం ఇప్పుడు దేశంలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కు తెలంగాణ రాష్ట్రంలోని వేటికి ఉగ్ర‌ముప్పు ఉంద‌ని ప‌రిశీలిస్తే… ముందు వ‌రుస‌లో నాగార్జున సాగ‌ర్ ఉంది. నాగార్జున సాగ‌ర్ రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చే క‌ల్ప‌త‌రువు. సాగు నీరు అందించే భూలోక గంగ‌. అలాంటి నాగార్జున సాగ‌ర్‌ను ఇప్పుడు ఉగ్ర‌వాదులు టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

నాగార్జున సాగ‌ర్‌తో పాటు తెలంగాణ లోని కాక‌తీయ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టుకు కూడా ఉగ్ర ప్ర‌మాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున‌సాగ‌ర్‌, కాక‌తీయ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టులు ఎంతో కీల‌క‌మైన‌వి. నాగార్జున సాగ‌ర్ బ‌హుళార్థ‌క సాధ‌క ప్రాజెక్టుగా ఉంది. సాగ‌ర్ నుంచి సాగునీరు, తాగునీరు అందుతుంది. దీంతో పాటు విద్యుత్ ఉత్ప‌త్తి కూడా అవుతుంది. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, ఎడ‌మ కాలువ ద్వారా తెలంగాణ‌కు సాగు, తాగునీరు అందుతుంది. అదే విధంగా విద్యుత్ ఉత్ప‌త్తి కావ‌డంతో ఈ ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. 

దీనికి తోడు కాక‌తీయ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ‌కు నిత్యం విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతుంది. అయితే ఈ రెండు ప్రాజెక్టుల‌ను ఉగ్ర‌వాదులు దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ట‌. ఈ మేర‌కు ఐబీకి అందిన స‌మాచారం మేర‌కు వెంట‌నే రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు హెచ్చ‌రిక‌లు పంపింద‌ట‌. దీనితో పాటు కేంద్ర విద్యుత్ శాఖ కూడా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింద‌ట‌. ఇదిలా ఉండ‌గా నాగార్జున సాగ‌ర్‌ను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశార‌ని గ‌తంలోనూ ప‌లుమార్లు హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రోమారు హెచ్చ‌రిక‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ రెండు ప్రాజెక్టుల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ది.

హై అలెర్ట్ :నాగార్జున సాగర్ డ్యామ్ కు ఉగ్ర ముప్పు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts