అభిమానుల వ‌ల్లే ఓడానంటున్న ప‌వ‌న్‌…!

July 6, 2019 at 11:58 am

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌న భాద్య‌త ఎంత‌మాత్రం లేద‌ని అది కేవ‌లం అభిమానుల వ‌ల్లే ఓడానని కుండ‌బద్ద‌లు కొట్టి మ‌రి చెప్పాడు గ‌బ్బ‌ర్ సింగ్‌. నేను ఓట‌మి గురించి కేవ‌లం పావుగంట‌లో మ‌రిచిపోయానంటూ… కానీ అభిమానులే అది ఏదో కొంప‌లు అంటుకుపోయిన‌ట్లుగా బాధ ప‌డుతున్నార‌ని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాత్రింభ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డి జ‌న‌సేన కోసం ప‌నిచేసిన అభిమానుల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ రేంజ్‌లో విమ‌ర్శించ‌డం ఇప్పుడు హాట్ టాపీక్‌గా మారింది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తానా సభ‌ల కోసం అమెరికా వెళ్ళాడు. అక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను ఎన్నిక‌ల్లో ఎందుకు ఓడిపోయానో, అస‌లు త‌న ఓట‌మికి ఎవ‌రు కార‌కులో వంటి విష‌యాల‌ను చెప్పాడు. అస‌లు తాను అమెరికా తానా స‌భ‌ల‌కు వ‌స్తానా రానా అనే సందిగ్థంలో ఉన్న‌ప్పుడు కూడా కొంద‌రు అభిమానులు వెళ్ళాలంటారు… కొంద‌రు వ‌ద్దంటారు… అయితే తాను ఇక్క‌డికి రావ‌డానికే సిద్ధ‌మ‌య్యాను అంటూ స‌భ‌లో చెప్పాడు. ఇంకా ఈ స‌భ‌లో అనేక ఆస‌క్తి క‌లిగించే విష‌యాల‌ను చెప్పాడు.

తాను ఓడిపోవ‌డానికి కార‌ణం అభిమానుల పిరికిత‌నం, అస‌మ‌ర్థుతే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించాడు. నేను పాల్గొన ప్ర‌తి స‌భ‌లో న‌న్ను సీఏం అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తూ జేజేలు ప‌లికారు అభిమానులు కాని ఎన్నిక‌ల్లో మాత్రం ఓట్లు వేయించ‌లేక‌పోయారు. క‌నీసం స‌భ‌ల్లో అర‌వ‌డం కాకుండా ఓట్లు వేయించి ఉంటే గెలిచేవాడిన‌ని ప‌వ‌న్ త‌న ఓట‌మిని అభిమానుల‌పై నెట్టేశాడు. తాను ఓట్ల కోసం రాలేద‌ని, స‌మాజంలో మార్పు కోసం త‌న‌వంతుగా ప‌నిచేద్దామ‌ని వ‌చ్చాన‌ని అన్నాడు. అయితే ఓడిపోయాయ‌న‌ని నేను బాధ ప‌డ‌టం లేద‌ని, ఆ బాధ‌ను కేవ‌లం 15నిమిషాల్లో మ‌రిచిపోయాన‌ని అన్నాడు.

నేను స్కామ్‌లు చేసి రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, ఈ స్కాముల నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొంద‌రు ప‌ని చేశార‌ని, నేను న‌మ్మిన సిద్ధాంతం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ఈ మార్గంలో ఓట‌మి చెందినా బాధ ప‌డేది లేద‌ని, గెలుపు సాధించేవ‌ర‌కు పోరాటం చేస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఖుషీ సినిమా విజ‌యం త‌రువాత గ‌బ్బ‌ర్ సింగ్ విజ‌యం దాకా అప‌జ‌యాలు వ‌చ్చినా ఆగాన‌ని, ఇప్పుడు కూడా అంతేన‌ని అన్నాడు. అంటే తాను రాజ‌కీయాల నుంచి విర‌మించుకునేది లేద‌ని రాజ‌కీయాల్లోనే కొన‌సాగుతాన‌ని చెప్ప‌క‌నే చెప్పాడు ప‌వ‌న్‌. నా స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌న‌మంతా ఓట్లు వేస్తార‌ని అభిమానులు అనుకున్నార‌ని నేను మాత్రం అలా అనుకోలేద‌ని అన్నాడు ప‌వ‌న్‌.

అభిమానుల వ‌ల్లే ఓడానంటున్న ప‌వ‌న్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts