బిల్లు చూసి షాక్ అయిన ప‌వ‌న్ హీరోయిన్‌

July 17, 2019 at 1:13 pm

కోలీవుడ్.. టాలీవుడ్… బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా ఎన్నో సంచలనాత్మక సినిమాలతో పాపులర్ అయిన రాయ్‌లక్ష్మి తాజాగా తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి గగ్గోలు పెడుతోంది. కోలీవుడ్.. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించిన నెంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేని రాయ్‌లక్ష్మి పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తోబ‌… తోబ ఐటెం సాంగ్ లో కూడా నటించింది. అందాలు ఆరబోసే విషయంలో ఎలాంటి హ‌ద్దులు పెట్టుకొని ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇచ్చింది.

అయితే తాజాగా తన ఇంటికి గత నాలుగైదు నెలలుగా వస్తున్న కరెంట్ బిల్ తో ఆమె మైండ్ బ్లాక్ అవుతోందట. ఈ బాధ‌ను ఆమె ట్వీట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. అస‌లు మేట‌ర్ ఏంటంటే గత కొన్నినెలలుగా రాయ్ ల‌క్ష్మి ఎంత బిల్లు కడితే… మ‌రుస‌టి నెల‌ అంతకు డబుల్‌ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై ఆరా తీద్దామని ఆదాని ఎలక్ట్రీసిటీ సంస్థకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే ఎంతకు కలవడం లేదన్నారు. 

తనకే ఇలా ఉంటే సామన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. నాలా ఎంత‌మంది ప్ర‌జ‌లు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారో ? అని కూడా ఆమె వాపోయింది. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇలా ఉచితంగా కట్టాలంటే బాధగా ఉంద‌ని కూడా ఆమె త‌న ట్వీట్‌లో వాపోయింది. అయితే ఈ ట్వీట్‌పై ఆదాని ఎలక్ట్రిసిటీ స్పందించింది. మీ అసౌక‌ర్యానికి చింతిస్తున్నాం… మీ వివ‌రాలు ఇస్తే స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాం అని పేర్కొంది.

 
బిల్లు చూసి షాక్ అయిన ప‌వ‌న్ హీరోయిన్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts