బ్రేకింగ్:వికటించిన పోసాని ఆపరేషన్ ..పరిస్థితి విషమం !

July 11, 2019 at 3:42 pm

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ్మ‌ర్‌లో పోసాని ఏపీలో వైసీపీ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆ పార్టీ త‌ర‌పున మీడియాలో బ‌ల‌మైన వాయిస్ కూడా వినిపించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. ఈ క్ర‌మంలోనే ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యి హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా ఆయ‌న్ను ప‌రామ‌ర్శించారు.

ఇక లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ ఆప‌రేష‌న్ విక‌టించిన‌ట్టు తెలుస్తోంది. ఆపరేషన్ జరిగిన చోట ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పోసాని తాజాగా మ‌రోసారి హాస్ప‌ట‌ల్లో జాయిన్ అయిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం పోసాని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని.. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.

ఇక పోసానికి మ‌రోసారి ఆపరేషన్ చేసి… ఒక‌టి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తార‌ని ఇండ‌స్ట్రీలోని ఆయ‌న‌ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నటుడిగా పోసాని ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా రాక‌పోయినా ఏపీలో వైసీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు అనుకూలంగా మీడియాలో స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ టైంలో ఆయ‌న కొంత కాలంగా అనారోగ్యానికి గురికావ‌డం కాస్త బాధాక‌రం. పోసాని మ‌ళ్లీ కోలుకుని వ‌రుస సినిమాల‌తో బిజీ అవ్వాల‌ని ఆశిద్దాం.

బ్రేకింగ్:వికటించిన పోసాని ఆపరేషన్ ..పరిస్థితి విషమం !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts