బెల్లంకొండ ‘ రాక్ష‌సుడు ‘ ఫ‌స్ట్ రివ్యూ… టాక్ ఎలా ఉందంటే…

July 30, 2019 at 10:54 am

బెల్లంకొండ శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా రాక్ష‌సుడు. కోలీవుడ్‌లో హిట్ అయిన రాచ్చ‌స‌న్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాను తెలుగులో రాక్ష‌సుడు పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫికెట్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే స్క‌ల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా తెర‌కెక్కింది. కోలీవుడ్‌లో రాచ్చ‌స‌న్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా అక్క‌డ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమాను మ‌క్కికి మ‌క్కీ దించేశారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సైకో కిల్లర్ కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి సైకో కిల్లర్ ను పట్టుకునే ఇన్వెస్టిగేట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది. బెల్లంకొండ కెరీర్ స్టార్టింగ్ నుంచి స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేదు. ఈ యేడాది ఇప్ప‌టికే సీత సినిమాతో మ‌రో ప్లాప్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక రాక్ష‌సుడుకు సెన్సార్ త‌ర్వాత మంచి టాక్ వ‌స్తోంది.

సెన్సార్ బోర్డు స‌భ్యులు కూడా ఉత్కంఠ రేపే క‌థాంశంతో ఈ సినిమా స్టోరీ న‌డుస్తుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్టు తెలుస్తోంది. ఏ స్టూడియోస్ – అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు.

బెల్లంకొండ ‘ రాక్ష‌సుడు ‘ ఫ‌స్ట్ రివ్యూ… టాక్ ఎలా ఉందంటే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts