రామ్‌చ‌ర‌ణ్‌కు ఫ్లాప్‌ల‌ సెంటిమెంట్‌..!

July 16, 2019 at 4:39 pm

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌కు ఓ ఫ్లాప్‌ల సెంటిమెంట్ ఉంది… ఇది మీకు తెలుసా… ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అలాగే రామ్ చ‌ర‌ణ్ జీవితంలో కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదే ప్లాప్ సినిమాల సెంటిమెంట్‌. ఓసారి లుక్కేద్దాం.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ చిరుత సినిమాతో తెరంగ్రేటం చేశారు. తెరంగ్రేటం సినిమా రామ్ చ‌ర‌ణ్‌కు యావ‌రేజ్‌గా ఆడింది. ఆ త‌రువాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా మ‌గ‌ధీర. ఈసినిమా సిని ప‌రిశ్ర‌మ‌లో బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది. ఇక మూడో సినిమాగా వ‌చ్చిన ఆరేంజ్ సినిమా మాత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇక ర‌చ్చ‌, నాయ‌క్ సినిమాలు హిట్ కొడితే 6వ సినిమాగా వ‌చ్చిన సినిమా తుఫాన్‌. ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్‌గా తేజ్‌కు మిగిలిపోయింది.

ఇక చ‌ర‌ణ్ న‌టించిన 7వ సినిమా ఎవ‌డు, 8వ సినిమా గోవిందుడు అంద‌రివాడేలే సినిమాలు హిట్ సాధించాయి. ఇక 9వ సినిమా బ్రూస్‌లీ యావ‌రేజ్‌గా నిలిచింది. ఇక 10వ సినిమా ధృవ‌, రంగ‌స్థ‌లం సినిమాలు బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ కాగా 12వ సినిమా విన‌య విధేయ రామ అనే సినిమా తేజ్‌ను తేల‌గొట్టింది. ఇక ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఈ సినిమా రామ్ చ‌ర‌ణ్‌కు బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌గా నిలిచిపోనున్న‌ది అనేది సెంటిమెంట్‌ను బ‌ట్టి చూస్తే తెలుస్తుంది. సో రామ్ చ‌ర‌ణ్‌కు ప్ర‌తి రెండు సినిమాల త‌రువాత మూడో సినిమా డిజాస్ట‌ర్ అవుతుంద‌ని అర్థం అవుతుంది. ఈ సెంటిమెంట్‌ను భ‌విష్య‌త్‌లో రామ్ చ‌ర‌ణ్ అధిగ‌మిస్తాడో లేదో చూడాలి మ‌రి.

రామ్‌చ‌ర‌ణ్‌కు ఫ్లాప్‌ల‌ సెంటిమెంట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)