
టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చరణ్‌పై కక్కుర్తిపై ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు బయట కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిరు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడంతో పాటు రకరకాల బిజినెస్‌లు కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు కూడా తీస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించి హిట్ కొట్టాడు.
ఇప్పుడు చిరు 151వ సినిమా సైరా నరసింహారెడ్డిని కూడా ఇదే బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తోన్న ఈ సినిమాపై ముందుగా తమ పర్మిషన్ కూడా తీసుకోలేదని చరణ్‌పై ఉయ్యాలవాడ కుటుంబీకులు గతంలోనే ఆరోపించారు.
ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను ఉయ్యాలవాడ కుటుంబీలకు పొలాల్లో చేసి పంట పొలాలు నాశనం చేశారట. ముందుగా శనగ పంట పాడైనందుకు గాను నష్టపరిహారం ఇస్తామని.. ఇప్పుడు మొఖం చాటేస్తున్నారని వారు రామ్‌చరణ్ ఇంటిముందు నిరసనకు దిగారు.
తండ్రి హీరోగా కోట్లాది రూపాయలతో ఇంతటి చారిత్రాత్మక కథాంశంతో సినిమా తీసేటప్పుటు రామ్‌చరణ్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు పరిహారం ఇస్తే ఏమవుతుందని… ఇంత చిన్న విషయంలో కక్కుర్తి ఏంటని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్. మరి దీనిపై చెర్రీ రియాక్షన్ ఎలా ఉంటుందో ? చూడాలి.