టాలీవుడ్ టాప్ హీరోయిన్ రోమాన్స్‌ రేటెంతో తెలుసా !

July 17, 2019 at 3:36 pm

అవును నేను అందంగా ఉంటాను… అభిన‌యంతో అందరిని మెప్పిస్తాను… అందుకే నా రేటు నా ఇష్టం అంటుంది ఈ అందాల భామ‌. చేసింది రెండు సినిమాలే… మూడో సినిమా ప్ర‌మోష‌న్‌లో ఉంది… ఈ మూడో సినిమాలో రోమాన్స్‌కు డోకా లేదు.. ఇప్పుడు మ‌రో సూప‌ర్‌హీరోతో ఓ పెద్ద సినిమాలో అవ‌కాశం కొట్టేసింది… ఇంకో సినిమా సెట్‌పైనే ఉంది… దీనికి తోడు త‌మిళంలోనూ త‌న స‌త్తా చాటుతుంది… 

ఇంకేముంది అటు తెలుగు, ఇటు త‌మిళంలో… త‌న‌కు బోలేడ‌న్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ పైస‌లు త‌క్కువ వ‌స్తున్నాయ‌నుకుంది… అందుకే రేటు పెంచేసింది… ఇప్పుడు ఆ రేటు విన్న ద‌ర్శ‌క నిర్మాతలు బెంబెలెత్తుతున్నారు… ఇంత‌కు ఈ రేటు పెంచింది ఎవ‌రో కాదు… ఛ‌లో, గీతా గోవిందం హీరోయిన్ ర‌ష్మీక మంద‌న్న‌. ఇప్పుడు ర‌ష్మీక మంద‌న్న‌కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌స్తుండ‌టంతో ఈ అమ్మ‌డు రేటు కూడా పెంచేసింద‌ట‌. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుండ‌టంతో అమ్మ‌డు స్పందించింది.

అవును నేను నా క‌ష్టంకు త‌గ్గ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాను… అంతే కానీ ఎక్కువ ఏమీ తీసుకోవ‌డం లేదు… అంద‌ట‌. సో రోమాన్స్‌తో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డియ‌ర్ కామ్రేడ్‌లో దుమ్ము రేపింద‌ట‌. లిప్‌లాక్‌ల‌తోనూ విజయ్‌తో పోటీ ప‌డింద‌ట‌. అంటే ఎంత రోమాన్స్‌కు అంత రేటు కాదా మ‌రి… అందుకే అమ్మ‌డు నా క‌ష్టంకు త‌గిన రేటు తీసుకుంటున్నాన‌ని అంటుందట‌. ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌హేష్‌బాబు స‌ర‌స‌న స‌రిలేరు నీకెవ్వ‌రులో, నితిన్‌తో భీష్మ‌లో, త‌మిళంలో త‌ల‌ప‌తి విజ‌య్‌తోనూ ర‌ష్మీక న‌టిస్తుంద‌ట‌. అందుకే అమ్మ‌డి రోమాన్స్ కు త‌గ్గ ధ‌ర ప‌లుకుతుంద‌ట‌…

 
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రోమాన్స్‌ రేటెంతో తెలుసా !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts