ర‌విప్ర‌కాశ్ కొత్త ఛానల్ వెనుక ఉన్న‌దెవ‌రు…?

July 18, 2019 at 12:14 pm

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్పుడు ఏం చేస్తున్నారు.. సంత‌కాల  ఫోర్జ‌రీ కేసులో ఆయ‌నను పోలీసులు అరెస్ట్ చేయ‌గా, బెయిల్‌పై బ‌య‌టకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టీవీ 9 నుంచి నిధులు దారి మ‌ళ్లించార‌ని అలంద కంపెనీ ప్ర‌తినిధులు ఆయ‌న‌పై అభియోగాలు మోపిన విష‌యం విధిత‌మే.  అయితే.. కొంత‌కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న ర‌విప్ర‌కాష్ పేరు మరోసారి వార్తల్లో  ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.  ఆయన టీవీ 36 అనే కొత్త ఛానెల్ పెడుతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమేరకు తెర‌వెనుక అన్ని ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్న‌ట్లు  తె లుస్తోంది. 

త‌న క‌ష్టం, అనుభ‌వం, ప‌ట్టుద‌ల‌తో టీవీ9ను దేశంలోనే ప్ర‌ముఖ ఛానల్గా నిలిపారు ర‌విప్ర‌కాశ్‌.. ప్ర‌స్తుతం ఆయ‌న టీవీ 9 కు దూరంగా ఉంటున్న నేప‌థ్యంలో త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించి ఒక కొత్త న్యూస్ ఛాన‌ల్ పెట్ట‌బోతున్నార‌ని ప్ర చారం జ‌రుగుతోంది. ఇంత స‌డెన్గా ఛానల్  పెట్టి, డెవ‌ల‌ప్ చేయడానికి కార‌ణం ఏమై ఉంటుంద‌నేది ఇప్పుడు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌..  అయితే 2024లో ఓ జాతీయ పార్టీ ని తెలంగాణ‌లో అధికారంలో తీసుకురావ‌డ‌మే ఈ ఛానల్ ముఖ్య  ఉద్దేశ‌మ‌ని మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  ఇప్ప‌టికే ఛానల్ కు సంబంధించినదిగా పేర్కొంటున్న ఓ లోగో కూడా బయటకు రావ‌డం గ‌మ‌నార్హం. 

అయితే టీవీ 36 అన్నది ఒకప్పటి టీవీ 9 జర్నలిస్ట్ జకీర్ తన ఫేస్ బుక్ పేజ్ కు పెట్టుకున్న పేరా..  లేకా కొత్త ఛానెల్ పేరా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకప్పటి టీవీ 9 జర్నలిస్ట్ జకీర్ ఫేస్ బుక్ లైవ్ పెడుతూ ఈ ఛానెల్ గురించి ఆయన స్వంత అభిప్రాయాలు, వినవస్తున్న వార్తలు, అన్నట్లుగా ఈ లైవ్ లో సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ, ఇవన్నీ వింటే, రవిప్రకాష్ తో జకీర్ టచ్ లో ఉన్నారని, లేదా రవిప్రకాష్ మాట మేరకే ఆయన ఈ లైవ్ లోకి వచ్చి ఈ విశేషాలు అన్నీ వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది. ఛానెల్ ఎలా ఉండబోతోంది, రవిప్రకాష్ ఆలోచనలు, కార్యాచరణ ఎలా ఉన్నాయి, ఇవన్నీ జకీర్ తనకు అందిన సమాచారం అన్నట్లుగా వెల్లడించారు. 

ఏదేమైనా తెలంగాణలో ఓ బ‌ల‌మైన‌ మీడియా అవసరం అని, యాంటీ కేసీఆర్, యాంటీ టీఆర్ఎస్ మీడియా సంస్థను నెల‌కొల్పాల‌ని ర‌విప్ర‌కాశ్ గ‌ట్టి ప‌ట్ఠుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంత‌మంది ఛానల్స్ న‌డ‌ప‌లేక‌, మూసేసుకుని ఇంటికెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌ముఖ వార్తాసంస్థ నుంచి ఉద్వాస‌న‌కు గురైన ర‌విప్ర‌కాశ్ కొత్త ఛానల్ తో  మ‌ళ్లీ వ‌స్తున్నారంటే, దీని వెనుక బ‌ల‌మైన పునాదులు ఉన్నాయ‌ని మీడియా వ‌ర్గాలు కోడైకూస్తున్నాయి. అయితే జ‌కీర్ మాట‌ల‌ను బట్టి, బీజేపీ జాతీయ నేత‌ల అండ‌తోనే ర‌విప్ర‌కాశ్ కొత్త ఛానల్ ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే ఇటీవ‌ల బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో ర‌విప్రకాశ్ ఢిల్లీలో భేటీ కావ‌డం ఈ అనుమానాల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి.

 
 
ర‌విప్ర‌కాశ్ కొత్త ఛానల్ వెనుక ఉన్న‌దెవ‌రు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts