3కోట్లుతో మొదలైన “ఆర్ఆర్ఆర్”

July 1, 2019 at 3:52 pm

ఆర్ ఆర్ ఆర్ మూవీలో సాంగ్ చిత్రిక‌ర‌ణ కోసం రూ.3కోట్ల వ్య‌యంతో రూపొందిస్తున్నార‌ట‌. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఈ సినిమా నిర్మాణ‌మే సుమారు రూ.400కోట్లు దాటే అవ‌కాశం ఉంద‌ట‌. ఇంత భారీ బ‌డ్జెట్‌తో సినిమాను తీస్తున్న రాజ‌మౌళి కేవ‌లం ఒక పాట కోస‌మే రూ.3కోట్ల మేర‌కు ఖ‌ర్చు చేయ‌నున్నాడ‌ట‌.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు ఇంట‌ర్‌డ్యూస్ సాంగ్‌ను భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి ఓ ప్ర‌త్యేక‌మైన సెట్‌ను త‌యారు చేయిస్తున్నార‌ట‌. ఈ సెట్‌ను రామోజీ ఫిలిం సిటిలో సెట్‌ను వేయిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుపుకుంటుంది. సెట్‌ను ఇప్ప‌టికే త‌యారు చేయించార‌ట రాజ‌మౌళి. ఈ ఇంట‌ర్‌డ్యూస్ సాంగే ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంద‌నే టాక్ ఉంది.

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలియాభ‌ట్ న‌టిస్తోన్న‌విష‌యం తెలిసిందే. అయితే ఆలియాభ‌ట్ షెడ్యూల్ ఆల‌స్యం అవుతున్న త‌రుణంలో హీరోల‌తో పాటుగా జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గోనే స‌న్నివేశాల‌ను చిత్రిక‌రిస్తార‌ట‌. హీరోయిన్లు రాగానే వారితో షూటింగ్ చేస్తార‌ట‌. ఇంకా జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే రెండో హీరోయిన్ కోసం ఇంకా వెతుకులాటే సాగుతుంది. మ‌రో హీరోయిన్ దొర‌క‌గానే చిత్రిక‌ర‌ణ పూర్తి చేస్తార‌ట‌. సో కేవ‌లం ఇద్ద‌రు హీరోలకు హీరోయిన్ల కొర‌త తీర‌గానే ఇంట‌ర్‌డ్యూస్ సాంగ్‌ను పూర్తిస్థాయిలో చిత్రిక‌ర‌ణ చేస్తార‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల క‌థ‌నం.

3కోట్లుతో మొదలైన “ఆర్ఆర్ఆర్”
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts