ఎక్స్‌ఫోజింగ్ కు ఏ స‌ర్టిఫికేట్‌…!

July 16, 2019 at 4:58 pm

సినిమా నిండా రోమాన్స్‌, ప్ర‌తి సిన్‌లో ప‌చ్చి బూతు మాట‌లు, డ‌బుల్ మీనింగ్ ప‌దాలు, సినిమాంత శృతిమించిన శృంగారంతో నిండి ఉండ‌టం… దీంతో సెన్సార్ బోర్డు ఏకంగా ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది… ఇంత‌కు ఇదేం సినిమా అనుకుంటున్నారా… అదేనండీ ఇటీవ‌లే ట్రైల‌ర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సినిమానే… ఇది హాలీవుడ్‌, బాలీవుడ్ సినిమా కాదు… ఇది టాలీవుడ్ సినిమానే…

ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల చేసిన ఈ సినిమా ఇస్మార్ట్ శంక‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్‌, రామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమా ను సెన్సార్ బోర్డు వీక్షించి చివ‌రికి ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా పెద్ద‌లు మాత్ర‌మే చూడాల‌ని సూచించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు స‌భ్యులు వీక్షించిన త‌దుప‌రి ఏ స‌ర్టిఫికేట్ జారీ చేశారు.

ఇస్మార్ట్ శంక‌ర్‌ను పూరి జ‌గ‌న్నాథ్‌, న‌టి ఛార్మీలు సంయుక్తంగా పూరీ సినిమాస్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ల‌తో రూపొందించార‌ట పూరి జ‌గ‌న్నాథ్‌. అయితే పూరి జ‌గ‌న్నాథ్ గ‌తంలో రూపొందించి, మ‌హేష్‌బాబు న‌టించిన పోకిరి సినిమాకు కూడా ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. అయినా ఆ సినిమాను జ‌నాలు ఆద‌రించారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను కూడా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం చిత్ర‌యూనిట్ వ్య‌క్తం చేసింది.

ఎక్స్‌ఫోజింగ్ కు ఏ స‌ర్టిఫికేట్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)