న‌రేష్‌తోనే కృష్ణ‌… ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో ఏం జ‌రిగింది…!

July 17, 2019 at 12:38 pm

దివంగత లెజెండ్రీ దర్శకురాలు విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణ అన్యోన్య దాంపత్యం గురించి తెలిసిందే.
విజయనిర్మల మృతి కృష్ణకు తీరని లోటు అని చెప్పాలి. విజయనిర్మల చనిపోయిన తర్వాత కృష్ణ తన ముగ్గురు కుమారుల్లో ఎవరి ? దగ్గర ఉంటార‌న్నదానిపై ఘట్టమనేని ఫ్యామిలీలో చర్చ నడిచిందట. మహేష్ బాబు… రమేష్ బాబు మాత్రం త‌మ ఇంటికి రావాలని కోరినా అందుకు కృష్ణ మాత్రం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

తనకు విజయనిర్మల ఇంటి తోనే చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని… వాటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారట. ఇక చాలా ఏళ్లుగా కృష్ణ విజ‌య‌నిర్మిల‌… నరేష్‌తో న‌రేష్‌ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు విజ‌య‌నిర్మల మ‌ర‌ణం ఆయ‌న్ను బాగా కుంగ‌దీసింది. కొద్ది రోజులు ఆ ప్లేస్ మారితే త‌మ తండ్రి మ‌న‌స్సు కుదుట‌ప‌డుతుంద‌ని ర‌మేష్‌, మ‌హేష్ భావించినా ఆయ‌న మాత్రం అక్క‌డ నుంచి వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని ఆ ఫ్యామిలీతో స‌న్నిహితంగా ఉన్న‌వారు అంటున్నారు.

ఇక ర‌మేష్‌, మ‌హేష్ కూడా తండ్రి నిర్ణ‌యానికి గౌర‌వం ఇచ్చి… ఈ విష‌యంలో బ‌ల‌వంతం చేయ‌లేద‌ట‌. అయితే ర‌మేష్‌, మ‌హేష్ మాత్రం ప్ర‌తి రోజు లేదా వీలున్న‌ప్పుడ‌ల్లా తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లి టైం స్పెండ్ చేసి వ‌స్తున్నార‌ట‌. ఏదేమైనా విజ‌య‌నిర్మల మ‌ర‌ణం కృష్ణ‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసినా ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రం ఆయ‌న‌కు ఆ బాధ లేకుండా చూసుకుంటున్నారు.

న‌రేష్‌తోనే కృష్ణ‌… ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో ఏం జ‌రిగింది…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts