తెలంగాణ‌కు గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మాస్వ‌రాజ్‌..!

July 22, 2019 at 3:35 pm

బీజేపీ దూకుడు పెంచింది. త‌న ఆధిప‌త్యాన్ని పెంచుకోవ‌డానికి పావులు చురుగ్గా క‌దుపుతోంది. దేశం మొత్తంగా అధికార‌మే ల‌క్ష్యంగా వెళ్తున్న ఆపార్టీ కొద్ది రోజులుగా రాష్ర్టాల‌పై ప్ర‌త్యేక ద్రుష్టి పెట్టింది. ఇప్ప‌టికే రాష్ర్ట పాల‌న‌లో కీల‌కంగా ఉన్న నేత‌ల‌కు గాలాలు వేస్తూ పార్టీని ప‌టిష్టం చేసుకునే దిశ‌గా క‌దులుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రీ ముఖ్యంగా తెలుగురాష్ర్టాల్లో త‌మ పాత్ర‌ను కీలకంగా, పార్టీని ముఖ్య‌భూమిక పోషించేదిగా తీర్చిదిద్దే చ‌ర్య‌ల‌కు పార్టీ ముఖ్య‌నేత‌లు శ్రీ‌కారం చుట్టారు. కొద్ది రోజులుగా అమిత్‌షా, రాం మాధ‌వ్ వంటి నేత‌లు త‌మ పూర్తి ద్రుష్టిని పూర్తిగా తెలుగు రాష్ర్టాల‌పైనే కేంద్రీక‌రించారు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లో పాగా వేయ‌డానికి ఉబ‌లాట‌ప‌డుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి అనుస‌రించిన విధానాల‌పై మొహం మొత్తి ఉన్న కాషాయం నేత‌లు ప‌గ‌తో ర‌గులుతున్నారు. అందునా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి తెలంగాణ ప్ర‌జానీకం నాలుగు స్థానాలు క‌ట్ట‌బెట్ట‌డంతో మ‌రింత ఉత్సాహంతో క‌ద‌ల‌డానికి వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఆ రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్‌ను మార్చి ఇప్పుడున్న న‌ర‌సింహన్‌ను మ‌రో ఇత‌ర సేవ‌ల్లో వినియోగించుకోవాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌కు గ‌వ‌ర్న‌ర్‌గా చిన్న‌మ్మ సుష్మాస్వ‌రాజ్‌ను నియ‌మించే విష‌య‌మై ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌త్యేక రాష్ర్ట కాంక్ష ఢిల్లీస్థాయిలో తీవ్రంగా వినిపించిన స‌మ‌యంలో సుష్మా స్వ‌రాజ్ త‌న‌దైన శైలిలో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ఆ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. పార్ల‌మెంట్‌లో మ‌ద్ద‌తు వేళ నిర్భ‌యంగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించి వారికి త‌ల్లిగా మారారు. ఇప్పుడు ఆ రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్‌గా వ‌స్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో అటు ప్ర‌జ‌లు, ఇటు బీజేపీ శ్రేణులు తీవ్ర సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎంతైనా పాత ప‌రిచ‌యం ఉన్న మ‌నిషి అవ‌డం, అందునా ఆమె వ‌స్తే ఆ రాష్ర్టంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేక‌పోవ‌డంతో పండుగ వాతావ‌ర‌ణం పులుముకుంటోంది. చూడాలి చిన్న‌మ్మ సుష్మా గ‌వ‌ర్న‌ర్‌గా ఎప్ప‌డు వ‌స్తారోన‌ని..!

తెలంగాణ‌కు గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మాస్వ‌రాజ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)