బిగ్‌బాస్ హౌజ్‌లో వీరే యుద్ధవీరులు…!

July 15, 2019 at 5:04 pm

బిగ్‌బాస్‌3 చర్చే ఎక్క‌డ చూసినా… ఓవైపు బిగ్‌బాస్ 3పై కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు, పోలీసుకు పిర్యాదు చేయ‌డం, షూటింగ్ పేరుతో మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నార‌ని ఓవైపు ఇలా వ‌రుస‌గా విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు బిగ్‌బాస్ 3కి భ‌లే క్రేజ్ సంపాదించింది. ఇది బిగ్ బాస్ 3 నిర్వ‌హ‌కులు ఆడుతున్న నాట‌క‌మా..? ఈ షోను విజ‌య‌వంతం చేసే క్ర‌మంలో కావాల‌నే ఇలా ప్ర‌చారం చేయిస్తున్నారా…? ఇది ఓ ర‌కంగా ఫ్రీ ప‌బ్లిసిటా అనే అనుమానాలు ఉన్న‌ప్ప‌టికి ఈ షో ప్రారంభం అయ్యేనాటికి ఇంకా ఎలాంటి వార్త‌లు వినాల్సి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

అయితే ఇలా బిగ్‌బాస్ 3 గురించి ప‌లు ర‌కాలు ఆరోప‌ణ‌లు వస్తున్ నేప‌థ్యంలో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున ఈ షోను ఎలా నిర్వహిస్తారో అనే అనుమానాల‌కు తావు లేన‌ప్ప‌టికి ఇందులో పాల్గొంటున్న కంటెస్టెన్స్ గురించి ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. ఈ బిగ్ బాస్ 3 హౌస్‌లోకి వెళ్ళే 15మంది కంటెస్టెంట్స్ ఎవ‌రు అనే ఆస‌క్తి ఇప్పుడు స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.. ఇందులో పాల్గొనే వారి పేర్ల‌ను అన‌ధికారికంగా ఇలా ఉన్నాయ‌ని మాత్రం తెలుస్తుంది…

15మంది పేర్ల‌పై సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. హౌస్ లోకి వెళ్ళేవాళ్ళ‌లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు తీన్మార్ సావిత్రి ఉర‌ప్ శివ‌జ్యోతితో పాటు, టీవీ9 జ‌ర్న‌లిస్టు ముఖాముఖీ ఫేం జాప‌ర్‌, నటులు వ‌రుణ్ సందేశ్‌, త‌రుణ్‌, న‌టిమ‌ణులు హేమ‌, హిమ‌జ‌, యాంక‌ర్ ఉద‌య‌బాను, గాయ‌కులు హేమచంద్ర‌, రాహుల్ సిప్లిగంజ్‌, ర‌ఘుమాస్ట‌ర్‌, మ‌హాత‌ల్లీ ఫేం జాహ్న‌వి, శ్రీ‌రెడ్డి, వైవా హ‌ర్ష‌, యాంక‌ర్ శ్రీ‌ముఖి, యాంక‌ర్ లాస్య ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇందులో మేము లేమంటూ యాంక‌ర్ లాస్య‌, ఉద‌య‌భాను, హీర్ త‌రుణ్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి ఈ శ‌నివారంతో అంతా తేలిపోనున్న‌ది.

బిగ్‌బాస్ హౌజ్‌లో వీరే యుద్ధవీరులు…!
0 votes, 0.00 avg. rating (0% score)