“ది లయన్ కింగ్ ” రివ్యూ & రేటింగ్

July 18, 2019 at 11:32 am

‘ది లయన్ కింగ్ : రివ్యూ 

నిర్మాణ సంస్థ‌: వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్‌

మ్యూజిక్ డైరెక్టర్ : హన్స్ జిమ్మర్

డైరెక్టర్ & ప్రొడ్యూసర్ : జాన్ ఫెవ్‌ర్యూ

ల‌య‌న్ కింగ్ సీక్వెల్‌లో భాగంగా తెర‌కెక్కిన చిత్రం ది ల‌య‌న్ కింగ్‌. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థ డిస్నీ నిర్మాణ సార‌ధ్యంలో వ‌చ్చిన సినిమా ది ల‌య‌న్ కింగ్. ఈ సినిమా ప్రాజెక్టును డిస్ని సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. అయితే గురువారం విడుద‌లైన ఈ సినిమా ప్ర‌పంచంలోని ప్ర‌ధాన‌మైన అన్ని భాష‌ల్లోనూ రూపొందింది. జంగిల్ యానిమేష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించిందో ఓసారీ టీజే స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

కథ :

అడవికి రారాజు సింహం (ముఫార్ ). తన వార‌సుడిగా రాజ్యానికి తన ‘కొడుకు సింహం’ (సింబా) రాజును చేయాల‌ని దృడంగా నిర్ణ‌యించుకుంటాడు. త‌న వార‌సుడైన‌ సింబాకి ఒక దేశానికి రాజు ఎలా ఉండాలో , ఎలా పాలించాలో చిన్నానాటి నుంచే త‌ర్పీదు ఇస్తాడు. రారాజై ముఫార్ తమ్ముడు (స్కార్ సింహానికి) సింబాను వార‌సుడిగా చేయ‌డం అస‌లు ఇష్టం ఉండ‌దు. దీంతో అన్న‌పై క‌క్ష పెంచుకుంటాడు. ముఫార్ ఓ రోజు క‌న్నుమూస్తాడు. సింబా చిన్నాన కుట్ర‌ల‌కు బ‌లికాకుండా రాజ్యానికి దూర‌మ‌వుతాడు. సింబా ఎప్పుడు త‌న రాజ్యానికి వ‌చ్చాడు… ఎలా రాజు అయ్యాడు… త‌న రాజ్యం క‌ష్టాల‌ను ఎవ‌రి సాయంతో తీర్చాడు.. తండ్రి ఆశ‌యాల‌ను, కోరిక‌ను ఎలా తీర్చాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

విజువ‌ల్ ఎఫెక్ట్స్ పుణ్య‌మా అని ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు ఆ అడవి రాజ్యంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న అనుభూతి చెందుతారు. న‌మ్మ‌క‌శ్యం కానీ  విజువల్స్ ఎఫెక్ట్స్‌తో,  భారీ సాంకేతిక విలువలతో తీయడమే ఈ సినిమాకు బ‌లం. అయితే ఈ సినిమాకు నేచుర‌ల్ స్టార్ నానీ సింబాగా, ముఫార్ గా పి.ర‌విశంక‌ర్‌, సార్క్‌గా జ‌గ‌ప‌తిబాబు డ‌బ్బింగ్ చెప్పారు. ఇక సింబాగా నానీ త‌న వాయిస్‌తో ర‌క్తి క‌ట్టించాడు ఇక పుంబా పాత్ర‌కు బ్ర‌హ్మానందం, టీమోన్ పాత్ర‌కు ఆలీల వాయిస్ సూప‌ర్‌గా సెట్ అయ్యింది. దీంతో ది ల‌య‌న్ కింగ్‌కు తెలుగులో మంచి బ‌లం చేకూరింది. మొత్తానికి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, సాంకేతికప‌ర‌మైన విలువ‌లు, తెలుగు న‌టుల డ‌బ్బింగ్‌తో ది ల‌య‌న్ కింగ్ సినిమా కింగ్‌గా నిలిచింద‌నే చెప్పొచ్చు.

 మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొత్త‌ద‌నం కోరుకునేవారికి కేవ‌లం సాంకేతిక విలువ‌లు, అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, తెలుగు న‌టుల వాయిస్ త‌ప్పితే మిగ‌తా అంతా కొత్త‌సీసాలో పాత సారాగా ఉంద‌నే చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే పూర్‌గా ఉంది. సినిమా సాగ‌దీత‌, అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాల పొడిగింపు ఇలా కొంత చికాకు తెప్పించే సీన్లు మైన‌స్‌గా మారాయి.

 సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక విభాగం ప‌ని విధానం బాగా ఉంది. అడ‌వి దృశ్యాల‌ను, వీ.ఎఫ్‌.ఎక్స్‌, కంప్యూట‌ర్ గ్రాఫీక్స్ ప‌నితీరు అద్భుతంగా ఉంది. ప్ర‌తి పాత్ర‌కు త‌గ్గ‌విధంగా వ‌ర్క్‌ను చ‌క్క‌గా ప్లాన్ చేసుకుని మ‌రి స‌క్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సో సాంకేతిక విభాగం ప‌నితీరులో ఎక్క‌డ లోపాలను వెత‌కాల్సిన ప‌ని లేద‌నిపించింది. 
 
తీర్పు :

3డి యానిమేటేడ్ టెక్నాల‌జీతో వ‌చ్చిన ఈ చిత్రం అద్భుత‌మైన విజువ‌ల్స్, ఎమోష‌న‌ల్ సీక్వెన్స్ బాగున్నాయి. ఇక పిల్లల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఈ సినిమా విజువ‌ల్స్‌, కంప్యూట‌ర్ గ్రాఫీక్స్ ప‌నితీరు ఎంతో నచ్చుతుంది. ఇక డిస్ని సంస్థ‌వారు చేసిన ఈ సాహ‌సంకు త‌గిన ఫ‌లితం ద‌క్కింద‌నే చొప్పొచ్చు. ఈ ప్ర‌య‌త్నంలో డిస్ని సంస్థ విజ‌య‌వంతం అయ్యింది. 

టీజే రేటింగ్ :  3/5

“ది లయన్ కింగ్ ” రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts