డైరెక్ష‌న్‌లో వేలుపెట్టి కెలికేస్తోన్న హీరో గారి భార్య‌

July 2, 2019 at 10:18 am

సినిమా హిట్ అవ్వాలంటే ద‌ర్శ‌క‌త్వ విభాగం కీల‌క‌మైంది. ఒక సినిమా హిట్ అవ్వాల‌న్నా… ఫ‌ట్ అవ్వాల‌న్నా ద‌ర్శ‌కుడి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ద‌ర్శ‌కుడికి ఎంత పెద్ద హీరో అయినా గౌర‌వం ఇవ్వాల్సిందే. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయ్యి సెట్స్ కెళ్లాక అన్ని బాధ్యతలు దర్శకుడివే. అయితే సెట్స్ కెళ్లాక కూడా దర్శకుడి పనిలో వేలు పెడితే దానిని ఫింగరింగ్ అంటారు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ద‌ర్శ‌క‌త్వ విభాగంలోకి వెళ్లి కెలికేస్తుంటార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ద‌ర్శ‌కుడికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చే హీరోల్లో ఫ‌స్ట్ ర్యాంక్ బాల‌య్యదే. ఒక‌సారి స్క్రిఫ్ట్ లాక్ అయ్యాక బాల‌య్య క‌థ‌లో అస్స‌లు వేలుపెట్ట‌డు. ఇక ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబు కూడా ఓకే. ఇక చాలా మంది హీరోలు క‌థ‌లో వేలు పెట్టి, ద‌ర్శ‌కుడికి స్వేచ్ఛ లేకుండా చేస్తుంటారు. ఇండ‌స్ట్రీలో ఓ ఫ్యామిలీ హీరోలు ద‌ర్శ‌కుడిని ఇబ్బంది పెట్టే విష‌యంలో మ‌రీ ఓవ‌ర్ చేస్తుంటార‌న్న టాక్ ఉంది.

ఇదిలా ఉంటే ఓ యంగ్ స్టార్ హీరో గారి భార్యామణి కూడా ఓ యంగ్ డైరెక్టర్ పనిలో వేలు పెట్టి కెలికేస్తోంద‌న్న టాక్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బాగా స్ప్రెడ్ అయ్యింది. అదేమంటే త‌న‌కు సినిమా అంటే ఎంతో ప్యాష‌న్ అని చెపుతూ చాలా సీన్లు ఎలా మార్చాలో ? ఆమే చెప్పేస్తోంద‌ట‌. అయితే వీళ్ల‌ను యేడాది పాటు భ‌రించాల‌ని అనుకున్నాడే ఆ డైరెక్ట‌ర్ ఈ సినిమా టేకాఫ్ చేశాడ‌ట‌. లేక‌పోతే అత‌డికి ఈ సినిమా ఛాన్స్ ఉంటుంద‌న్న గ్యారెంటీ ఉండ‌దు క‌దా.. ఇక ఇటీవ‌ల హీరోల భార్య‌లు కూడా సినిమా వ్య‌వ‌హారాల్లో దిగిపోతూ తెర‌వెన‌క చాలా క‌థ న‌డిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

డైరెక్ష‌న్‌లో వేలుపెట్టి కెలికేస్తోన్న హీరో గారి భార్య‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts