రామేశ్వ‌ర్‌రావుపై tv9రవిప్రకాష్ మొదటి ఆస్త్రం

July 5, 2019 at 3:21 pm

ర‌విప్రకాశ్‌.. రామేశ్వ‌ర్‌రావు.. ఒకరు జ‌ర్న‌లిస్టు.. మ‌రొక‌రు రియ‌ల్ ఎస్టేట్ కింగ్‌..! టీవీ9కు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌లాగా ఉంటూ అత్యున్న‌త‌స్థాయికి తీసుకెళ్లిన జ‌ర్న‌లిస్టుగా దేశ‌వ్యాప్తంగా జ‌ర్న‌లిస్టు ర‌విప్ర‌కాశ్‌కు గుర్తింపు పొందారు. అయితే.. టీవీ9 అలంద మీడియా కొనుగోలు చేసిన త‌ర్వాత‌.. అంటే మైహోమ్ రామేశ్వ‌ర్‌రావు తీసుకున్న త‌ర్వాత‌.. అవ‌మాన‌క‌రంగా ర‌విప్ర‌కాశ్‌ను బ‌య‌ట‌కు పంపారు. ఆయ‌న తీవ్ర‌స్థాయిలో రామేశ్వ‌ర్‌రావు ఆరోప‌ణ‌లు చేస్తూ ఫిర్యాదు చేయ‌డం.. దానిపై కేసు న‌మోదు కావ‌డం.. ప్ర‌స్తుతం ముంద‌స్తు బెయిల్ కోసం.. ర‌విప్ర‌కాశ్ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌డం తెలిసిందే.

అయితే.. మొద‌ట మొత్తం మైహోం రామేశ్వ‌ర్‌రావుదే పైచేయిగా కనిపించినా.. తాజాగా ప‌రిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఈ విష‌యంలో ర‌విప్ర‌కాశ్‌దే పైచేయిగా క‌నిపిస్తోంది. రామేశ్వ‌ర్‌రావుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఉంది. మొన్న‌టి వ‌ర‌కు ర‌విప్ర‌కాశ్‌కు ఎవ‌రి మ‌ద్ద‌తూ లేదు. ఒంట‌రిగానే రామేశ్వ‌ర్‌రావును ఎదుర్కొన్నారు. కానీ.. తాజాగా.. ర‌విప్ర‌కాశ్‌కు కేంద్రం అండ‌.. అంటే బీజేపీ మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రంలోని పెద్ద‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే మైహోం రామేశ్వ‌ర్‌రావు ఆస్తిపాస్తులు, వ్యాపారాల‌పై ఐటీ దాడులు జ‌రిగాయ‌ని, ఇదంతా కూడా ర‌విప్రకాశ్ చేసిన ఫిర్యాదుల వ‌ల్లే జ‌రిగాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. ఈ ప‌రిణామాల‌ను ముందే ప‌సిగ‌ట్టిన రామేశ్వ‌ర్‌రావు కొంత వెన‌క్కి త‌గ్గారు. రాజీకోసం ప్ర‌య‌త్నాలు చేయ‌గా.. అందుకోసం ర‌విప్రకాశ్ ఒప్పుకోన‌ట్లు తెలిసింది. అయితే.. టీవీ9కు సంబంధించిన లావాదేవీలు, లోటుపాట్లు తెలిసిన ర‌విప్ర‌కాశ్ వాటినే ఆయుధాలు చేసుకుని.. మారిషెస్ నుంచి అక్ర‌మ పెట్టుబ‌డులు, నిబంధ‌న‌ల ఉల్లంఘన‌.. ఇలా పూర్తి స్థాయిలో నివేదిక‌తో ఫిర్యాదు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో ఎలాగైనా పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న బీజేపీకి ర‌విప్ర‌కాశ్ లాంటి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంలోని పెద్ద‌లు ర‌విప్ర‌కాశ్‌కు అండ‌గా నిలుస్తున్న‌ట్లు తెలుస్తోంది. అస‌లు తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుందో పూస‌గుచ్చిన‌ట్లు ర‌విప్ర‌కాశ్ వారికి వివ‌రించిన‌ట్లు స‌మాచారం. ఏదిఏమైనా.. ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన పోరు.. క్ర‌మంగా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో.. ముందుముందు ఎన్నిమ‌లుపులు ఉంటాయో చూడాలి మ‌రి.

రామేశ్వ‌ర్‌రావుపై tv9రవిప్రకాష్ మొదటి ఆస్త్రం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts