వల్లభనేని వంశీకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్నల్ ?

July 12, 2019 at 11:00 am

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ క‌ద‌లిక‌లు, ఇత‌ర పార్టీల నేత‌ల‌ను క‌ల‌వ‌డాలు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అనేక ఊహాగానాల‌కు ఆస్కార‌మిస్తున్నాయి. అటు బీజేపీ నేత‌ల‌ను, ఇటు వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న క‌లుస్తుండ‌డంతో పార్టీ మారుతార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న పోక‌డ‌.. పార్టీ మారుతార‌నే వాద‌న‌కు మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి. అయితే.. ఇటీవ‌ల టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే.

అయితే.. సుజ‌నాచౌద‌రికి వంశీ కూడా ద‌గ్గ‌రి బంధువు కావ‌డంతో ఆయ‌న కూడా బీజేపీలోకి వెళ్తార‌నే ఊహాగానాలు వినిపించాయి. ఆ త‌ర్వాత కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు కూడా ఎమ్మెల్యే వ‌ల‌భ‌నేని వంశీ క‌లవ‌డంతో ఇక ఆయ‌న పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ.. ఆ ప్ర‌చారాన్ని వంశీ ఖండించారు. ఇక తాజాగా… వంశీ వైసీపీలోకి వెళ్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల అసెంబ్లీలో జ‌గ‌న్‌ను వంశీ క‌లిశారు.

గ‌న్న‌వరం నియోజ‌క‌వ‌ర్గంలోని నీటి స‌మ‌స్య‌పై వివ‌రించారు. అందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి.. సీఎం జ‌గ‌న్‌తో వంశీ ఎం మాట్లాడారో ఎవ‌రికీ తెలియ‌దు కానీ.. పైకి మాత్రం నీటి స‌మ‌స్య గురించి అని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ చూపు వైసీపీ వైపు ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గం మీదుగా వెళ్తున్న పోలవరం కుడికాలువ నీటిని వాడుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని గ‌తంలోనూ వ‌ల్ల‌భ‌నేని వంశీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు.

నిజానికి.. ఇప్ప‌టికే ఆ కాల్వ‌పై మోటార్లను ఏర్పాటు చేసి, నీటిని వాడుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంతో త‌న‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వంశీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందుకు సీఎం జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. ఒక‌వేళ‌.. నీటి వాడ‌కానికి జ‌గ‌న్ అనుమ‌తి ఇస్తేమాత్రం వంశీ వైపీపీలోకి వెళ్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

వల్లభనేని వంశీకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్నల్ ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts