విజ‌య్ డేటింగ్‌కు వ‌స్తావా అంటున్న మలయాళం హీరోయిన్

July 18, 2019 at 1:20 pm

అర్జున్‌రెడ్డి సినిమాతో సెన్సేష‌న్‌గా మారిన టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించిన న‌టీ బంఫ‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది.. ఈ ఆఫ‌ర్ అట్లాంటి ఇట్లాంటి ఆఫ‌ర్ కాదు.. ఏకంగా డేటింగ్‌కు వ‌స్తావా.. అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో త‌న ఖాతాలో పోస్టు చేసి ఇప్పుడు అంద‌రికి అవాక్క‌య్యేలా చేసింది. ఇంత‌కు రౌడీ హీరోనే బుట్ట‌లో వేయాల‌నుకుంటున్న ఈ న‌టి ఎవ‌రు.. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించిన ఈ అమ్మ‌డు ఎవ‌రు అనేది ఇప్పుడు హాట్ టాపీక్‌గా మారింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను నా ద‌గ్గ‌ర ఒకే ప్ర‌శ్న ఉంది…  మీరు నాతో డేటింగ్‌కు వ‌స్తారా..?  అవును ల‌వ్‌… విజ‌య్ దేవ‌ర‌కొండ అంటూ త‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చిరున‌వ్వులు చిందిస్తూ ఇద్ద‌రు ఎంతో ఇష్టంతో దిగిన ఫోటోను పోస్టు చేసింది ఈ గ‌డుగ్గాయి… అస‌లే అభిమానుల తాకిడి, ఆపై ఇప్ప‌టికే ఎంద‌రో రౌడీకి క‌ర్చీఫ్‌లు వేసి మ‌రి ఎదురుచూస్తుండ‌గా, ఇప్పుడు ఈ సిని న‌టీ ఏకంగా డేటింగ్‌కు వ‌స్తారా అని అందంటే ఈమే మాములు కంచు కాద‌ని అర్థ‌మ‌వుతుంది… ఇంత‌కు ఈమే ఎవ‌రో అనే ఉత్కంఠ పెరిగిపోతుంది క‌దా… 

మ‌ళ‌యాళంలో 30కి పైగా సినిమాల్లో న‌టించింది. క‌న్న‌డ‌, తెలుగు చిత్రాల్లోనూ న‌టించింది ఈ అమ్మ‌డు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బంగారం సినిమాలోనూ న‌టించిన ఈ అమ్మ‌డు సానుష‌. సానుష జీనియ‌స్‌, జెర్సీ సినిమాల్లోనూ న‌టించింది. అయితే ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా (మ‌ళ‌యాళం వెర్ష‌న్‌) అక్క‌డికి వెళ్లాడ‌ట‌. విజ‌య్‌ను క‌లిసిన సానుష విజ‌య్‌ను క‌లుసుకుని ఓ ఫోటో కూడా దిగింద‌ట‌. ఆ ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసి, దానికి డేటింగ్‌కు వ‌స్తారా అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింద‌ట‌. ఈ ఫోటోల విజ‌య్ కూడా చిరున‌వ్వులు చిందిస్తుండ‌టంతో అంద‌రు విజ‌య్ డేటింగ్‌కు ఓకే అన్నాడ‌ని తెగ కామెంట్లు చేస్తున్నారు… సో మ‌రి ఇంత‌కు సానుష‌తో విజ‌య్ డేటింగ్‌కు ఓకేనా…

విజ‌య్ డేటింగ్‌కు వ‌స్తావా అంటున్న మలయాళం హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts