పృద్వీకి కేబీనేట్ హోదా ఇస్తున్న‌ జ‌గ‌న్‌…!

July 13, 2019 at 3:49 pm

30ఇయ‌ర్స్ ఇన్ ఇండ‌స్ట్రీ అంటూ తెగ హ‌డావిడి చేసే కామెడియ‌న్ పృద్వీ. ఇప్పుడు ఈ 30ఇయ‌ర్స్ న‌టుడు కేబీనేట్ హోదాలో చైర్మ‌న్ ప‌దవిని పొంద‌బోతున్నాడు. న‌మ్ముకున్న నాయ‌కుడు జ‌గ‌న్ పృద్వీకి బంప‌రాఫ‌ర్ ఇవ్వ‌బోతున్నాడు. ఇప్ప‌టికే పృద్వీకి ఇచ్చే ప‌ద‌విపై క్లారిటీ ఇచ్చాడ‌ట‌. దీంతో పృద్వీ సంతోషంతో త‌బ్బిబ్బ‌వుతున్నాడ‌ట‌. ఇంత‌కు పృద్వీకి ఏపీ సిఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇస్తున్న ప‌ద‌వి ఏంటంటే…

టాలీవుడ్‌లో హేమాహేమీలైన న‌టులున్నాడు. టాలీవుడ్ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ వైఎస్సార్ పార్టీ కోసం ఎవ‌రు ప‌నిచేయలేదు స‌రిక‌దా అటు వైపు కూడా క‌న్నేత్తి చూడ‌లేదు. వైఎస్సార్ పార్టీ కోసం కేవ‌లం ప‌నిచేసిన వారిలో న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళీ, 30ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ కామెడియ‌న్ పృద్వీతో మాత్ర‌మే ముందు వ‌రుస‌లో ఉన్నారు. దీంతో ఇప్పుడు పృద్వీ వైఎస్సార్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా కూడా ఉన్నారు. ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకోసం శ్ర‌మించిన పృద్వీకి ఇప్ప‌డు జ‌గ‌న్ కొత్త ప‌ద‌విలో కూర్చోబెట్ట‌బోతున్నార‌ట‌.

మొన్న‌టి దాకా టాలీవుడ్ లెజెండ్ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేప‌ట్టిన బాధ్య‌లు ఇప్పుడు పృద్వీని వ‌రించ‌బోతుంద‌ట‌. కె.రాఘ‌వేంద్ర‌రావు మొన్న‌టి దాకా శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు చైర్మ‌న్‌గా ఉన్నాడు. జ‌గ‌న్ సీఎం కాగానే ఆయ‌న రాజీనామా చేశాడు. దీంతో ఈ ప‌ద‌విని పృద్వీకి ఇవ్వ‌బోతున్న‌ట్లు జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చాడ‌ట‌. త్వ‌ర‌లో నియామ‌య ఉత్త‌ర్వులు ఇవ్వ‌నున్నాడ‌ట‌. సో ఇక మిగిలింది పోసాని కృష్ణ‌ముర‌ళీకి జ‌గ‌న్ మ‌రో ప‌ద‌వి ఇవ్వ‌నున్నారు. అయితే పోసాని ఆరోగ్యం బాగా లేక‌పోవ‌డంతో ఆయ‌న బాగుప‌డిన త‌రువాత ఆయ‌న‌కు కూడా ఓ మంచి ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌ట‌.

పృద్వీకి కేబీనేట్ హోదా ఇస్తున్న‌ జ‌గ‌న్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts