అసెంబ్లీలో జ‌గ‌న్ దూకుడు ముందు బాబు బెంబేలు…!

July 11, 2019 at 12:44 pm

రాజ‌కీయాల్లో దూకుడు స‌హ‌జ‌మే. ఎదుటి ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేసేందుకు లేదా ఓడించేందుకు ఇవ‌త‌లి ప‌క్షం దూకుడుగానే ఉంటుంది. అవ‌త‌లి వారు ఒక అడుగు వేసే లోపే.. ఇవ‌త‌లి వారు ఆ ఒడ్డుకు చేరిన ప‌రిస్థితి కూడా క‌నిపించింది. అయితే, వీటిని ఎప్ప‌టిక‌ప్ప‌డు అంచ‌నా వేసుకోవ‌డం రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు కొట్టిన పిండి. దీనిని బ‌ట్టే రాజ‌కీయ పార్టీల బ‌లాబ‌లాలు తెలుస్తాయి. వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో ప‌స బ‌య‌ట ప‌డుతుంది.

అయితే, తాజాగా సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అధికార పార్టీ నేత‌, సీఎం జ‌గ‌న్ వేసిన అడుగుతో బిత్త‌ర పోయారు. ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు సాగుతున్నాయి. రేపు(శుక్ర‌వారం) బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో తొలిరోజు ప్ర‌శ్నోత్త‌రాలు స‌హా వివిధ బిల్లుల‌పై చ‌ర్చ కూడా కొన‌సాగేందుకు వీలు క‌ల్పించారు. అయితే, ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్థి నిమ్మ‌ల రామానాయుడు అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నించి మొత్తం పార్టీనే అభాసు పాలు చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు రిబ్బ‌న్ క‌టింగుకు, కొబ్బ‌రి కాయ కొట్టేందుకు సీఎం జ‌గ‌న్ వెళ్లిన విష‌యాన్ని ప్ర‌స్థావించిన ఆయ‌న నాలుగేళ్ల కింద‌ట క‌ర్నూలు జ‌గ‌న్ చేసిన జ‌ల దీక్ష‌ను ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. కాళేశ్వ‌రానికి వ్య‌తిరేకంగా పోరాడిన జ‌గ‌న్‌.. తెలుగు ప్ర‌జ‌ల ముఖ్యంగా ఏపీ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్నార‌ని అన్నారు. దీనిపై వెంట‌నే స్పందించిన స‌భానాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌.. అన్ని తెలిసే తాను కాళేశ్వ‌రం ప్రాజెక్టు శంకు స్థాప‌న‌కు వెళ్లాన‌ని, ఇది తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీకి చేస్తున్న మేలు అని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే గోదావ‌రి న‌ది ప‌రివాహకం గురించి స‌భ‌లో వివ‌రించారు.

ఐదేళ్లు అధికారంలో ఉండి కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం జ‌రుగుతుంటే చూస్తూ చేతులు ముడుచుకున్న మీరా నాకు నీతులు చెప్పేది అన్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబును ఆ ఐదేళ్లు మీరు గాడిద‌లు కాశారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిగా కౌంట‌ర్ ఇవ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చే స‌రికి చంద్ర‌బాబు చేతులు ఎత్తేశారు. ఇది చాలా సీరియ‌స్ విష‌యం అంటూనే తాను ఈ విష‌యంపై మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని, అంత‌గా ప్రిపేర్ కాలేద‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. దీంతోస‌భ ఒక్క‌సారిగా నిర్గాంత పోయింది.

అసెంబ్లీలో జ‌గ‌న్ దూకుడు ముందు బాబు బెంబేలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts