జగన్ పై నేష‌న‌ల్ మీడియాస్టోరీ

July 1, 2019 at 10:02 am

నేష‌న‌ల్ మీడియా! జాతీయ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన ముద్ర వేసిన మీడియా ఇది. ప్ర‌స్తుతం ఈ మీడియాలో సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా ద‌క్షిణాదికి చెందిన సీఎం జ‌గ‌న్ నిలిచారు. తాజాగా నాలుగు రోజుల నుంచి జ‌గ‌న్ వార్త లేకుండా జాతీయ మీడి యా వార్త‌లు ఉండ‌డం లేదంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. గ‌తంలో చంద్ర‌బాబుకు క‌వ‌రేజ్ ఇచ్చినా.. అతి అత్యంత స్వ‌ల్ప‌మే. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ గురించి ది హిందూ మొద‌లుకుని టైమ్స్ ఆఫ్ ఇండియా వ‌ర‌కు ప్ర‌తి జాతీయ ప‌త్రికా.. జ‌గ‌న్ గురించి రాస్తోంది. జ‌గ‌న్ గురించిన క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. పాల‌నా ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల్లో జ‌గ‌న్ దూసుకుపోతుండ‌డమే. ప‌ట్టుమ‌ని 30 రోజులు కూడా కాకుం డానే జ‌గ‌న్ త‌న‌దైన ముద్ర వేస్తున్నార‌నేది జాతీయ మీడియా క‌థ‌నాల సారాంశం. ముఖ్యంగా గ‌త సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మీక్షించ‌డం ద్వారా జ‌గ‌న్ దూసుకుపోతుండ‌డాన్ని జాతీయ మీడియా హైలెట్ చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా గ‌త ప్ర‌భుత్వం నిర్మించిన ప్ర‌జావేదిక నిర్మాణాన్ని రాత్రికిరాత్రి కూల‌గొట్ట‌డంపై జ‌గ‌న్‌కు అనుకూలంగా జాతీయ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది.

నిజానికి జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ చెబుతున్న విష‌యం ప్ర‌కారం న‌దుల‌ను కాపాడాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పైనే ఉంది. ఇదే విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా చెబుతోంది. ఈ నేప‌థ్యంలో కృష్ణాన‌ది గ‌ర్భంలో నిర్మించిన ప్ర‌జావేదిక‌ను కూల దోయ‌డం ద్వారా ప్ర‌భుత్వం రాబోయే రోజుల్లో ఏం చేయ‌నుంద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ఉంద‌ని అంటున్నారు జాతీయ మీడియా విశ్లేష‌కులు. మ‌రీ ముఖ్యంగా ఏ రాజ‌కీయ పార్టీ అయినా .. ఎన్నిక‌ల‌కు ముందు అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని చెబుతుంద‌ని,అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేతులు క‌ట్టుకుని కూర్చుంటుంద‌ని, కానీ, జ‌గ‌న్ విష‌యంలో మాత్రం ఇది రివ‌ర్స్ అయింద‌ని అంటున్నారు.

తాను ఎన్నిక‌ల స‌మ‌యంలో అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని ఒక్క‌మాట‌గా మాత్ర‌మే చెప్పార‌ని, కానీ ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నార‌ని జాతీయ మీడియా విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే, కేంద్రంపై ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఒత్తిడి తేవ‌డం ద్వారా జ‌గ‌న్‌కు ఒకింత ఇబ్బందులు ఎదురు కావ‌డం క‌ష్ట‌మ‌ని, ఇది మిన‌హా 30 రోజుల జ‌గ‌న్ వ‌ర్క్ రిపోర్టు భేష్‌గా ఉంద‌ని అంటున్నారు.

జగన్ పై నేష‌న‌ల్ మీడియాస్టోరీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts