వైఎస్ జ‌యంతి వేళ‌.. హోరెత్తిన జ‌గ‌న్నినాదం

July 8, 2019 at 4:17 pm

రాష్ట్రంలో మ‌రోసారి జ‌గ‌న్నినాదం హోరెత్తింది. గ‌త ఏప్రిల్ 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భారీ మె జారిటీ సాధించి.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ నినాదం మార్మో గింది. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్తాడు..? విభ‌జ‌న క‌ష్టాల నుంచి రాష్ట్రాన్ని ఎలా గ‌ట్టెక్కిస్తాడ‌నే చ‌ర్చ జోరుగా సాగింది. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలోనే జ‌గ‌న్ తానేంటో ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కే కాకుండా రాజ‌కీయ నేత‌ల‌కుకూడా చూపిం చారు. పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటు క‌ల్పించారు. పోలీసుల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఆయ‌న పాల‌న అమృత ఫ‌లాల‌నే అందించింద‌ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న టాక్‌.

ఇక‌, తాజాగా జ‌గ‌న్ త‌న తండ్రి, మాజీ సీఎం, దివంగ‌త రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతు భ‌రోసా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ నెల రోజుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌ను ప్ర‌జ లకు సోదాహ‌ర‌ణంగా వినిపించారు. హంగు, ఆర్భాటాల‌కు, అంత‌కు మించి ప్రచారానికి కూడా చాలా దూరంగా ఉన్న జ‌గ న్‌.. త‌న పాల‌న‌లో మెరుపులు మెరిపించారు. ప్ర‌స్తుతం వైఎస్ జ‌యంతి రోజున రాష్ట్ర ప్ర‌జ‌లు యావ‌త్తు కూడా వీటినే చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌తి ఏటా పింఛ‌న్ల‌ను రూ.250 చొప్పున పెంచుతాన‌ని పాద‌యాత్ర స‌మ‌యంలో ఇచ్చిన హామీని ఆయ‌న సాకారం చేసుకున్నారు.

అంత‌కుమించి రైత‌లుకు ఇచ్చిన ప్ర‌తి వాగ్దానాన్నీ చేసిచూపించేందుకు జ‌గ‌న్ ఉత్సాహం ప్ర‌స్ఫుటంగా క‌నిపించింది. ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వ ఫ‌లాలు అందేలా ఆయ‌న చేసిన ప‌క్కా ప్లాన్ స‌క్సెస్ అయింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న అమ‌లు చేసిన పింఛ‌న్ల పెంపు, రైతుల‌కు భ‌రోసా కింద న‌గ‌దు పంపిణీ వంటి కార్య‌క్ర‌మాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అనే టాక్ వినిపిస్తోంది. ఇక‌, పోలీసుల‌కు వీక్లీ ఆఫ్‌లు మ‌రోసంచ‌ల‌న నిర్ణ‌యం. తాను పాద‌యాత్ర‌లో చెప్పిన‌ట్టు.. త‌న తండ్రిని మించిన పాల‌న అందించేదుకు చేస్తున్న కృషిలో ఈ నెల రోజులు జ‌గ‌న్ వేసిన అడుగుల‌కు ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో ఇంకెన్నిమెరుపులు కురిపిస్తారో చూడాలి!

వైఎస్ జ‌యంతి వేళ‌.. హోరెత్తిన జ‌గ‌న్నినాదం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts