వైసీపీ కీల‌క నేత‌ల మౌనం.. ఎందుకు? ఏం జ‌రిగింది?

July 17, 2019 at 10:48 am

“అధ్య‌క్షా.. మా వాళ్లు.. ఇంత మంది ఉన్నారు. ఒక్క‌రంటే ఒక్క‌రుకూడా మాట్లాడ‌డం లేదు. దేనికైనా నేనే స‌మాధానం చెబుతున్నారు. ఏ విష‌యాన్న‌యినా నేనే మాట్లాడుతున్నాను!“- అంటూ. తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ బ‌డ్జ‌నెట్ స‌మావేశాల్లో సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు చాలా లోతుగానే విశ్లేష‌ణ‌కు గుర‌వుతున్నాయి. నిజ‌మే. అధికార పార్టీకి స‌భ‌లో సంఖ్యా బ‌లం భారీగానే ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షానికి కౌంట‌ర్ ఇచ్చే నాయ‌కులు కానీ, ప్ర‌తిప‌క్షానికి దీటుగా స‌మాధానం చెప్పే నేత‌లు కానీ వేళ్ల మీదే లెక్కించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. నిజానికి యువ‌తకు పెద్ద‌పీట వేసిన జ‌గ‌న్‌.. స‌భ‌లోనూ వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

చీఫ్ విప్‌గా గ‌డికోట శ్రీకాంత్ రెడ్డికి విప్‌లుగా కొంద‌రు కీల‌క నాయ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చారు. మ‌రి వీరంతా ప్ర‌భుత్వ ప‌క్షాన ప్ర‌తిప‌క్షంపై దూకుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. స‌బ్జెక్ట్ విష‌యంలో మాత్రం నోరు విప్పేందుకు జంకుతున్నారు. మ‌రీ ముఖ్యంగా గ‌త చంద్ర‌బాబు పాల‌న‌పై విమ‌ర్శ‌లు సంధిస్తున్న వైసీపీలోని కొంద‌రు కీల‌క నాయ‌కులు.. సబ్జెక్టుపై అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. సున్నా వ‌డ్డీ రుణాల‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ఈ లోటు అధికార ప‌క్షం నుంచి బాగానే క‌నిపించింది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ పైవిధంగా స్పందించారు.

ఇక‌, బుగ్గ‌న వంటి వారు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వాన్ని త‌న‌కు తానుగా ఇరుకున పెడుతున్నార‌నే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇక‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ సీనియ‌ర్ నాయ‌కుడే అయినా.. ఆయ‌న మాట్లాడుతున్న విధానం, స‌బ్జెక్టు లోతుపాతుల‌ను ఎక్క‌డా స్పృశించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు డ‌మ్మీనా? అనే కామెంట్లు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డే మ‌రో విష‌యాన్ని చ‌ర్చించుకోవాలి. పార్టీలో ఒకింత స‌బ్జ‌క్టుపై అవ‌గాహ‌న‌, గ‌తంలో మంత్రులుగా చేసిన వారు ఉన్న‌ప్ప‌టికీ.. వారికి జ‌గ‌న్ త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని వాళ్లు భావిస్తున్నారు.

దీంతో వారు అస‌లు అసెంబ్లీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. వీరిలో శ్రీకాకుళం నుంచి గెలిచిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పెన‌మ‌లూరు నుంచి విజ‌యం సాదించిన కొలుసు పార్త సార‌ధి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి ఇక‌, ఫైర్ బ్రాండ్ రోజా కూడా జ‌గ‌న్‌పై అల‌క‌తోనే ఉన్నా తాజా ప‌ద‌వి త‌ర్వాత ఆమెలో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె కూడా ఎక్క‌డా స‌భ‌లో పార్టీత‌ర‌ఫున గ‌ళాన్ని వినిపించ‌డం లేదు. రాబోయే రోజుల్లో అయినా.. జ‌గ‌న్ ఇలాంటి వారికి అవ‌కాశం క‌ల్పించాలనే డిమాండ్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ కీల‌క నేత‌ల మౌనం.. ఎందుకు? ఏం జ‌రిగింది?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts