అందాల సుంద‌రితో బ‌న్నీ ఐట‌మ్ సాంగ్‌ …!!

August 22, 2019 at 10:04 pm

బ‌న్నీతో ఓ ఐట‌మ్ సాంగ్‌లో ఆడి పాడ‌నుంద‌ట టాలీవుడ్ టాప్ హీరోయిన్, అందాల సుంద‌రి..ఓ ప‌క్క హీరోయిన్‌గా ఫుల్ బిజిగా ఉన్న ఈ సుంద‌రి, ఇప్పుడు బ‌న్నీ సినిమాలో ఆయ‌నతో క‌లిసి ఓ ప్ర‌త్యేక పాట‌లో న‌ర్తించ‌నుండ‌టంతో సినిమాపై భారీ హైప్ క్రియోట్ అవుతుంది.. ఇంత‌కు బ‌న్నీతో ఐట‌మ్ సాంగ్‌లో న‌టించే ఆ సుంద‌రి ఎవ‌రై ఉంటుందా అనేది ఆస‌క్తిక‌రంగా ఉంది క‌దూ…

ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో నేను పక్కా లోకల్ ప‌క్కా లోక‌ల్ .. అనే ప్రత్యేక గీతంలో మాస్ శైలి నృత్యాలతో అభిమానుల్ని ఫిదా చేసింది కాజల్ అగర్వాల్. తాజాగా ఆమె మరో ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింద‌ట‌. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురంలో. కుటుంబ అనుబంధాలు, అప్యాయతల కలబోతగా త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో కథానుగుణంగా ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ ఐట‌మ్ సాంగ్‌లో కాజ‌ల్‌ను ఎంపిక చేశార‌ట‌. సినిమా ప‌రంగా ఈ ఐట‌మ్ సాంగ్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో కాజ‌ల్ కూడా అందుకు అంగీక‌రించింద‌ట‌. త్వరలో ఈ పాటను అల్లు అర్జున్, కాజల్‌లపై భారీ హంగులతో తెరకెక్కించనున్నట్లు తెలిసింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

అందాల సుంద‌రితో బ‌న్నీ ఐట‌మ్ సాంగ్‌ …!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts