ఆనాడే అమితాబ్‌ను మించిన మెగాస్టార్‌…!!

August 22, 2019 at 12:26 pm

మెగాస్టార్ చిరంజీవి.. ఈపేరుకు ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు… అబాల గోపాలాన్ని త‌న న‌ట‌న‌తో అల‌రించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈరోజు… 64వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి త‌న న‌ట‌న‌తో ఇప్ప‌టికి అంద‌రిని మెస్మ‌రైజ్ చేస్తూనే ఉన్నాడు. పునాది రాళ్ళ నుంచి ఖైదీ నెంబ‌ర్ 150 వ‌ర‌కు అంద‌రిని అల‌రించిన చిరు… ఇప్పుడు సైరాతో మ‌న‌ముందుకు రాబోతున్న త‌రుణంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది…

బాలీవుడ్ ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ను ఓ విష‌యంలో 1990లోనే మించిపోయాడ‌నే టాక్ ఉంది.. అది కేవ‌లం టాకే కాదు.. ఓ ప్ర‌ముఖ మేగ‌జైన్ కూడా ఈవిష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించి కూడా.. ఇంత‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ను ఓ ప్రాంతీయ భాష‌లో మెగాస్టార్ దాటిపోవ‌డం ఏంట‌నే క‌దా మీ డౌట్‌. అయితే ఓసారి లుక్కేయండి…

1955 ఆగ‌స్టు 22న మొగ‌ల్తూరులో జ‌న్మించాడు. త‌ల్లి అంజ‌నీదేవి, తండ్రి వెంక‌ట్‌రావు. కొణిద‌ల శివ శంక‌ర ప్ర‌సాద్‌గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పునాదిరాళ్ళ‌తో అడుగుపెట్టి చిరంజీవిగా మారిన ఈ హీరో ఇప్పుడు మెగాస్టార్‌గా రూపాంతరం చెందాడు. అయితే 1990లో మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా.. అక్ష‌రాల రూ.1.25కోట్ల‌ట‌.. అంటే ఆనాడు బాలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్‌గా ఉన్న అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా అంత రెమ్యూన‌రేష‌న్ తీసుకునేవాడు కాద‌ట‌. అంటే ఆనాడు దేశ‌వ్యాప్తంగా ఉన్న హీరోల్లో చిరంజీవే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోన్న‌మాట‌… ఎంతైనా మెగాస్టార్ క‌దా…

ఆనాడే అమితాబ్‌ను మించిన మెగాస్టార్‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts