అరుణ్ జైట్లీ కన్నుమూత‌..!

August 24, 2019 at 2:25 pm

బీజేపీ నేత,కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆగస్టు 9 నుంచి ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు. 20 వతేదీన ఆయనకు వెంటిలేటర్‌ను అమర్చారు.

జైట్లీకి ఎయిమ్స్‌లో మ‌ల్టీ డిసిప్లిన‌రీ వైద్యుల‌తో కూడిన బృందం చికిత్స చేసింది. ఆయ‌న‌కు రక్త‌పోటు హృద‌య స్పంద‌న ఎక్కువుగా ఉండ‌డంతో వాటిని కంట్రోల్‌లోకి తెచ్చేందుకు వైద్యులు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. జైట్లీ బీజేపీలో ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న నేత‌గా పేరొందారు. అనారోగ్య‌ కారణాల వల్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయ‌లేదు.

ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న‌కు అనారోగ్యంతో క‌ద‌ల్లేని ప‌రిస్థితుల్లో ఉండ‌డంతో మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ సైతం మ‌రో కేంద్ర మంత్రి పియూష్‌ గోయ‌ల్ ప్ర‌వేశ‌పెట్టారు. తాజా ఎన్నికల తరువాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, జైట్లీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయినా జైట్లీపై ఉన్న అభిమానంతో ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపి ఏదైనా ప‌ద‌వి ఇద్దామా ? అన్న ఆలోచ‌న మోడీ చేసినా ఈలోగానే ఆయ‌న మృతిచెందారు.

అరుణ్ జైట్లీ కన్నుమూత‌..!
0 votes, 0.00 avg. rating (0% score)