అబ్బాయి కోసం బాబాయ్ త్యాగం…!!

August 19, 2019 at 6:09 pm

ప్ర‌తి సంక్రాంతికి నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా ఒక‌టి ఉంటుంది. సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే బాల‌య్య అభిమానుల‌కు పండుగే పండుగ‌… అయితే ఇప్పుడు బాల‌య్య అభిమానుల‌కు పండుగ లేకుండా చేశాడు బాల‌య్య బాబు. ఈసారి సంక్రాంతి పండుగ బ‌రి నుంచి తాను త‌ప్పుకుని త‌న అబ్బాయి కి లిప్ట్ ఇచ్చాడ‌ట‌.

ప్ర‌స్తుతం బాల‌య్య కెఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో ఉంటుంద‌ని, ప్రిన్స్ మ‌హేష్‌బాబు, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌ల‌తో పోటీ ప‌డుతాడ‌ని అంద‌రు ఊహించారు. అయితే అనుకోని విధంగా కెఎస్ ర‌వికుమార్‌తో చేస్తున్న సినిమా డిసెంబర్‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంద‌ట‌. ఇది నిజ‌మోనే కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగితే విష‌యం తెలుస్తుంది.

ఇక పోతే నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ స‌తీష్ వేగ్నిశ కాంబినేష‌న్‌లో ఎంతమంచి వాడ‌వురా అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు సిద్దం అవుతున్నార‌ట‌. ఈ సినిమా కోస‌మే బాల‌య్య సైడ్ అయ్యాడ‌ట‌. కొడుకు కోసం బాబాయి చేసిన త్యాగం బాగానే ఉంది కానీ అబ్బాయి మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌ల తాకిడి త‌ట్టుకుని సంక్రాంతి బ‌రిలో నిల‌దొక్కుకుంటాడా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

అబ్బాయి కోసం బాబాయ్ త్యాగం…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts