బిగ్‌బాస్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ క‌న్ఫార్మ్‌…!

August 24, 2019 at 2:49 pm

నెల రోజుల క్రితం ప్రారంభ‌మైన తెలుగు బిగ్‌బాస్ చాలా ర‌స‌వ్త‌రంగా సాగుతోంది. మొదలైన నాలుగు వారాలలో నలుగురు షో కి బై చెప్పివెళ్లిపోయారు. ఈవారం ఎలిమినేషన్ కి గాను ఏడుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. మరి ఈ ఏడుగురిలో ఎవ‌రు ? ఎలిమినేట్ అవుతారా ? అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది.

తొలి నాలుగు వారాల్లో వ‌రుస‌గా హేమ‌, టీవీ 9 యాంక‌ర్ జాఫ‌ర్‌, ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి, నాలుగో వారంలో మ‌రో సీరియ‌ల్ న‌టి రోహిణి ఎలిమినేట్ అయిపోయారు. బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ గురించి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్ప‌టికే హౌస్లోకి వ‌చ్చి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన త‌మ‌న్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే రెండో వారం హౌస్‌లోకి వ‌చ్చింది.

ట్రాన్స్‌జెండ‌ర్ అయిన త‌మ‌న్నా సింహాద్రి హౌస్‌లో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆమె ర‌వి లాంటి వాళ్ల‌ను ఏకంగా మ‌గాడివేనేరా అంటూ చాలా ఘాటుగా కామెంట్లు చేసింది. హౌస్‌లో ఆమెకు ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయ‌ని ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. చివ‌ర‌కు ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బ‌య‌ట నెటిజ‌న్లు కూడా త‌మ‌న్నాను ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు…. ప‌ర‌మ చెత్త ఎంట్రీ అంటూ విమ‌ర్శ‌లు చేసి ఆమెను బ‌య‌ట‌కు పంపేశారు.

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు మ‌రో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె టాలీవుడ్ హీరోయిన్ కావ‌డం విశేషం. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా బిగ్ బాస్ షో లోకి ప్రవేశించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈషా రెబ్బా త‌న గ్లామ‌ర్ షోతో చాలా సినిమాల్లో మెప్పించింది. ఇప్పుడు ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే హౌస్‌కు మ‌రింత గ్లామ‌ర్ యాడ్ అయిన‌ట్టే.

బిగ్‌బాస్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ క‌న్ఫార్మ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts