జగన్‌కు కేంద్రానికి మధ్య.. బాబు వ్యూహం ఏంటి…?

August 18, 2019 at 11:02 am

అవును! ఇప్పుడు ఈ విషయంపైనే రాజకీయ మేధావులు దృష్టి పెట్టారు. కేంద్రంలో జగన్‌ కలుపుకొని పోతు న్నారు. సఖ్యతగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన కశ్మీర్‌ వివాదం దేశాన్ని అతలా కుతల చేస్తున్న సమయంలోను, మరోపక్క, బీజేపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ హఠా న్మరణం చెందిన సమయంలో కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఇటు కేంద్ర మంత్రుల వరకు అందరూ కూడా జగన్‌కు అప్పాయింట్‌ మెంట్‌ ఇచ్చి గంటల తరబడి ఆయన చెప్పింది విన్నారు. ఇదే ఇప్పుడు ఏపీ లో రాజకీయాన్ని హైటెంపరేచర్‌లో వేడెక్కించింది.

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో చాలా గందరగోళంలో ఉన్నారు. తాను అధికారంలో ఉండగా.. 29 సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. ప్లీజ్‌ ప్లీజ్‌ అని వేడుకున్నా ఒక్కసారి కూడా అప్పాయింట్‌ మెంట్‌ ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు జగన్‌ పిలుపు వినిపిస్తే చాలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అప్పాయింట్‌ మెంట్‌ ఇవ్వడం ఆయనకు చాలా ఇబ్బందిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.

ఈ విషయాన్ని చంద్రబాబు మనసులో దాచుకోలేక పోతున్నారని, ప్రెస్‌ మీట్‌లలో తన అసహనాన్ని ప్రదర్శిస్తు న్నారని మీడియా మిత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటి? కేంద్రంతో జగన్‌ సఖ్యతగా ఉంటే ఎందుకు బాబు దిగులు పెట్టుకుంటున్నారు? అనే సందేహాలపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో బాబు అండ్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం చంద్రబాబుకు చాలా ఉంది. దీనికి ఆయనకు కావాల్సింది.. ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు వచ్చే ఐదేళ్లపాటు అలానే ఉండిపోవాలి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవాలి. అమరావతిలో ఒక్కరాయికూడా పడరాదు. అదేసమయంలో పేదలు పేదలుగానే ఉండిపోవాలి.ముఖ్యంగా ప్రత్యేక హోదా కూడా అలానే ఉండిపోవాలి. ఇవి కనుక పుంజుకుంటే.. జగన్‌ కనుక వీటిపై దృష్టి పెట్టి కేంద్రాన్ని మచ్చిక చేసుకుని ఏదైనా సాధిస్తే.. వైసీపీ ఇంకా బలంగా ప్రజల్లో పునాదులు వేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం-జగన్‌కు మధ్య సఖ్యతను చూస్తుంటే.. బాబుకు ఒళ్లు మండుతోంది. అయితే, అటు కేంద్రం కానీ, ఇటు జగన్‌ కానీ.. బాబు అనే వ్యక్తి ఒకరు ఉన్నారని కూడా లెక్కచేయకపోవడం మరింతగా ఆయనకు మంట పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాబు ఇలా కుమిలిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. నిజమే కదా!!

జగన్‌కు కేంద్రానికి మధ్య.. బాబు వ్యూహం ఏంటి…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts