త‌మ్ముళ్ల‌కో ప్ర‌శ్న‌.. డ్రోన్ రాజ‌కీయాల‌తో సాధించిందేంటి..?

August 19, 2019 at 1:55 pm

ఏపీ విప‌క్షం టీడీపీ చేస్తున్న రాజ‌కీయాలు ఎబ్బెట్టుగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఒక‌ప‌క్క రాష్ట్రంలోని నాలుగు జిల్లాల ప్ర‌జ‌లు కృష్ణా, గోదావ‌రి న‌దుల వ‌ర‌ద ప్ర‌భావంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వీరికి సాయం అందించ‌డంలో ప్ర‌భుత్వం దూకుడుగానే ఉంది. ఎక్క‌డిక‌క్క‌డ సాయం అం దుతోంది. ఈ విష‌యంలో ఏమాత్రం తేడాలేద‌ని, పూర్తిగా సాయం అందుతోంద‌ని సాక్షాత్తూ టీడీపీ శ్రేణులే పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నాయి. పున‌రావాస కేంద్రాల్లోని ప్ర‌జ‌ల‌కు అన్ని సౌక‌ర్యాలు అందుతున్నా యి. ఈ ప‌రిస్థితిలో అధికార ప‌క్షాన్ని విమ‌ర్శించే అవ‌కాశం టీడీపీకి లేకుండా పోయంది.

దీంతో టీడీపీ నాయ‌కులు డ్రోన్ రాజ‌కీయాల‌ను ఎంచుకున్నారు. నిజానికి డ్రోన్లు ఎగ‌ర‌డం అనేది ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఏదో కొత్తగా తీసుకువ‌చ్చిన విష‌యంగా టీడీపీ నేత‌లు చెబుతున్నారు. నిజానికి గ‌తంలో నే డ్రోన్ల‌ను ప్ర‌యోగించ‌డం, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డం వంటివి స‌హ‌జమే. అయి తే, దీనిని రాజ‌కీయంగా చేయ‌డం ద్వారా ప్ర‌స్తుతం పేద‌ల‌కు, వ‌ర‌ద బాధితుల‌కు అందుతున్న సా యంపై ఎక్క‌డా చ‌ర్చ‌కు రాకుండా చూడాల‌ని ప్ర‌తిప‌క్షం నిర్ణ‌యించుకున్న‌ట్టుగా విమ‌ర్శ‌లు వినిపిస్తు న్నాయి. చంద్ర‌బాబు హ‌యాంలోనే తునిలో కాపులు స‌మావేశం అయిన‌ప్పుడు ఆ మొత్తం త‌తంగాన్నీ చిత్రీక‌రించేందుకు డ్రోన్ల‌ను వినియోగించిన సంఘ‌ట‌న ఇప్పుడు మ‌రొసారి తెర‌మీదికి వ‌స్తోంది.

అప్ప‌ట్లో కాపులు త‌మ‌కు చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌పై చ‌ర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేసుకుం టేనే వారిపైకి డ్రోన్ల‌ను పంపి ఏం జ‌రుగుతోందో చిత్రీక‌రించిన టీడీపీ ప్ర‌భుత్వం.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భు త్వం ప్ర‌కాశం బ్యారేజీ ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ఎందుకింత‌గా హైరానా ప‌డుతోంద‌ని ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. నిజానికి.. ప్ర‌కాశం బ్యారేజీకి వ‌చ్చే వ‌ర‌ద ప‌రిస్థితిని అంచ‌నావేసేందుకే తాముడ్రోన్ పంపామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది అయితే, కేవ‌లం చంద్ర‌బాబు నివాసాన్ని తెలుసుకునేందుకే ఇలా చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అయితే, బాబు నివాసాన్ని షూట్ చేసినంత మాత్రాన పోయేదేమీ లేదు.

మునిగిపోయే ఇంటిని ఎవ‌రూ ఆప‌లేరు. ఈ చిన్న లాజిక్ తెలిసి కూడా త‌మ్ముళ్లు ఇలా వ‌ర‌ద స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌కుండా.. బుర‌ద రాజ‌కీయాలు చేయ‌డం ఏమాత్రం స‌మంజ‌సంగా లేద‌ని అం టున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ స‌మ‌యంలోనే స్పందించిన టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ.. బుద్దా వెంక‌న్న ఏకంగా తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం మ‌రింత విడ్డూరంగా ఉంద‌ని అంటున్నారు. పార్టీలో త‌న‌కు గుర్తింపు కోరుకోవాల‌ని, కావాల‌ని అనుకుంటే.. త‌ప్పులేద‌ని, దీనికి ఇంత పెద్ద ఎత్తున డైలాగులు అవ‌స‌ర‌మా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా .. త‌మ్ముళ్ల రాజ‌కీయం గాడి త‌ప్పుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

త‌మ్ముళ్ల‌కో ప్ర‌శ్న‌.. డ్రోన్ రాజ‌కీయాల‌తో సాధించిందేంటి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts