మెగా బ‌ర్త్‌డేకు స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రో తెలుసా….!!

August 19, 2019 at 6:23 pm

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాములుగా పుట్టినరోజు వేడుకలకు మెగాస్టార్ దూరంగా ఉంటారు. చాలా తక్కువ సందర్భాల్లో పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ పాల్గొంటూ ఉంటారు. ఈసారి కూడా మెగాస్టార్ ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నారు.

అయితే మెగా కుటుంబం ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఎవ‌రు ముఖ్య అతిధిగా హాజ‌రవుతున్నారో తెలుసా.. ఏ రాజ‌కీయ నాయ‌కుడో… మ‌రేదైనా సిని న‌టుడా.. అనే అనుమానం రాక‌మాన‌దు… అయితే ఈరెండింటితో సంబంధం ఉన్న ఓ ప్ర‌ముఖుడు హాజ‌ర‌వుతున్నాడు… ట్విస్టేంటంటే… మెగాస్టార్ బ‌ర్త్‌డేకు ముఖ్యఅతిథిగా వ‌స్తున్న‌ది మెగా బ్ర‌ద‌ర్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇది నిజ‌మే సుమా… ఇటీవ‌ల కాలం లో మెగా కుటుంబంతో ప‌వ‌ర్‌స్టార్ రాసుకుపూసుకు తిరుగుతున్న విష‌యం తెలిసిందే..

ఆగష్టు 22వ తేదీన శిల్పకళా వేదికలో వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకు మెగా హీరోలందరూ హాజరుకాబోతున్నారని వినికిడి. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా అందరూ హాజరువుతున్నారట. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైతే.. ఆ హంగామా వేరుగా ఉంటుంది. రంగస్థలం విజయోత్సవ సభ తరువాత పవన్.. చరణ్ కలవలేదు. నాపేరు సూర్య వేడుక తరువాత బన్నీ.. పవన్ కలుసుకోలేదు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ హీరోలంతా ఒకేచోట కలిస్తే.. మెగా అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పొచ్చు.

మెగా బ‌ర్త్‌డేకు స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రో తెలుసా….!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts