వైర‌ల్ అవుతోన్న మెగా మెసెజ్‌…!!

August 22, 2019 at 9:51 pm

అత‌డో మెగాస్టార్‌… ఆయ‌న కొడుకెమో మెగా ప‌వ‌ర్‌స్టార్‌.. తండ్రి కొడుకులు ఇద్ద‌రు మెగాస్టార్లే… ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకుంటున్నాడు… అయితే మెగాస్టార్‌కు మెగా ప‌వ‌ర్ స్టార్ పంపిన పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వైర‌ల్‌గా మారాయి.. తండ్రికి కొడుకు పంపిన మెసెజ్ అంత వైర‌ల్ ఎందుకయ్యింద‌బ్బా అనే అనుమానం క‌లుగొచ్చు.. మ‌న‌మోసారి లుక్కేద్దాం…

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. అభిమానులు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి సెలెబ్రిటీలు విషెస్ చెప్తున్నారు. ఇలా విషెష్ చెప్పిన వాళ్లలో రామ్ చరణ్ కూడా ఉన్నారు. మెగాస్టార్ సైరా సినిమా నిర్మాతగా బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా విషెస్ చెప్పారు.

“మీరు లక్షలాది మందికి స్ఫూర్తి.. మెంటార్.. ఒక మార్గదర్శకుడు. స్ఫూర్తి పొందే మిలియన్ అభిమానుల్లో నేను ఒకడిని. వాళ్లంతా `మెగాస్టార్` అని పిలుస్తారు. నేను `అప్పా` అని పిలుస్తాను. నేడు అప్పా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ఇలానే మాలో స్ఫూర్తిని నింపుతూ ఉండాలి. మీపై ఎంతో ప్రేమతో… హ్యాపి బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి” అని సోషల్ మీడియాలో మెసేజ్ చేశారు. మెగా పవర్ స్టార్ చేసిన ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వైర‌ల్ అవుతోన్న మెగా మెసెజ్‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts