మెగాస్టార్ లీక్ చేసాడోచ్‌…!!!

August 19, 2019 at 5:53 pm

మెగాస్టార్ చిరంజీవి సాధార‌ణంగా త‌న సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌ను ఎవ‌రితో పంచుకోడు.. అందులోనూ చిత్ర ద‌ర్శ‌కుడు, సినిమా యూనిట్‌కు మాత్ర‌మే సినిమా విష‌యాలను మీడియాకు వెల్ల‌డిస్తారు… అంతే త‌ప్ప మెగాస్టార్ చిరు మాత్రం సినిమాపై నోరు విప్ప‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు సైరా సినిమాకు సంబంధించిన‌ది అదే జ‌రిగింది. అయితే మొద‌టిసారిగా చిరంజీవి నోరు విప్పారు… విప్ప‌డ‌మే కాదు.. ఓ కీల‌క‌మైన విష‌యాన్ని లీక్ చేసాడు…

ఇంత‌కు మెగాస్టార్ లీక్ చేసిన విష‌యం ఏమై ఉంటుంది… ఓ సారి చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి సైరా కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతున్నది. సైరా తరువాత మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అన్ని పూర్తయ్యాయి. మెగాస్టార్ పుట్టినరోజైన ఆగష్టు 22 వ తేదీన ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది.

సినిమాకు పనిచేసే టెక్నిషియన్స్ ఎంపిక పూర్తయిందట‌. నటీనటుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 లో నటించిన కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. ఇదే సినిమాలో రంగ‌మ్మ‌త్త యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్నది. ఇందులో మెగాస్టార్ రెండు వేరియేషన్స్ లో ఉండే పాత్రలు చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేయ‌డం లేద‌ని మెగాస్టార్ లీక్ చేశాడు..

మెగాస్టార్ లీక్ చేసాడోచ్‌…!!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts