చిరుకు ఆ హీరోయిన్‌తో ఘోర అవ‌మానం ..!

August 22, 2019 at 9:26 pm

సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా తిరుగులేని విజ‌యాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోల‌కే షాక్ ఇస్తోన్న న‌య‌న‌తార తాజాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తోంది. రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

లేడీ ఓరియంటెడ్ రోల్స్‌తో కూడా బంప‌ర్ హిట్లు కొడుతోన్న న‌య‌న‌తార పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ వ‌చ్చినా కూడా నో చెప్పేయ‌డ‌మో లేదా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డ‌మో చేస్తున్నార‌న్న కంప్లెంట్లు ఉన్నాయి. తాజాగా చిరు సినిమాలో చిరు ప‌క్క‌న న‌టించిన న‌య‌న‌తారను నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌మోష‌న్ల‌కు ఆహ్వానించినా ఏ మాత్రం లెక్క చేయ‌కుండా లైట్ తీస్కొంటున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్‌ సినిమా కావటం, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ చిత్రం కావటంతో ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఈ సినిమాకు ప‌నిచేసిన స్టార్లు అంద‌రూ పాల్గొంటున్నారు. ఇటీవ‌ల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో చిరంజీవితో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ లాంటి నటులు పాల్గొన్నా.. నయనతార మాత్రం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఈ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మానికి న‌య‌న‌తార వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా కూడా ఆమె డుమ్మా కొట్టేశారు. మెగాస్టార్ అయినా ఎవ‌రు అయినా నాకేంటి అన్న‌ట్టుగా ఆమె వ్య‌వ‌హార శైలీ ఉందంటున్నారు. చిరులాంటి సీనియ‌ర్ హీరో విష‌యంలో ఆమె ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం చిరుకు అవ‌మాన‌మే అన్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది.

చిరుకు ఆ హీరోయిన్‌తో ఘోర అవ‌మానం ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts