చూసి చూడంగానే ఫ‌స్ట్‌లుక్‌…!

August 19, 2019 at 1:37 pm

ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ సినిమా ఫ‌స్ట్‌పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేశారు.

గ‌తంలో పెళ్ళిచూపులు, మెంటల్ మదిలో వంటి మంచి చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరి. ఆయ‌న త‌న‌యుడే శివ కందుకూరి. కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేస్తూ చూసీ చూడంగానే అనే సినిమాను నిర్మిస్తున్నారు. మంచి అభిరుచి ఉన్న నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు కోసం ఓ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీని ద‌ర్శ‌కుడు శేష సిందూరావు త‌యారు చేయ‌డంతో సినిమాను రూపొందిస్తున్నారు.

చూసి చూడంగానే అనే సినిమాలో న‌టిస్తున్న‌ హీరో శివ కందుకూరి పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ గా న‌టిస్తున్నాడు. ఓ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆగస్ట్ 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. సినిమాకు సంగీతం జాతీయ అవార్డు గ్ర‌హిత గోపి సుంద‌ర్ అందిస్తుండ‌గా, నిర్మాత సురేష్‌బాబు చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.

చూసి చూడంగానే ఫ‌స్ట్‌లుక్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts