టాలీవుడ్ హీరోయిన్… డోలో బిళ్ల‌కు ల‌క్ష బిల్ల‌ట‌…!!

August 22, 2019 at 10:20 pm

డోలో బిల్ల‌కు ల‌క్ష‌ల బిల్ల‌ట‌… ఈ టైటిల్ చూడ‌గానే మేమంతా ఎర్రిప‌ప్ప‌ల‌మా… ఎవ్వ‌రిని ఫూల్ చేయ‌డానికి ఇంత త‌మాషా చేస్తున్నారు.. ఇది విన‌డానికి మాకు లేకున్నా… చెప్ప‌డానికి మీకైనా ఉండాలి కొంత కామ‌న్ సెన్స్ అనుకుంటున్నారా…వినడానికి కామెడీగా ఉన్నా అది నిజమని అంటోంది హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. ఈమె ఎవరా అనుకుంటున్నారా ? తాజాగా కౌసల్యా కృష్ణ మూర్తి అనే సినిమా వస్తోంది కదా ఆ సినిమా హీరోయిన్.

తెలుగమ్మాయి అయిన ఈమె తల్లి తండ్రులు చెన్నైలో సెటిల్ అవ్వడం వలన ఆమె తమిళ్‌ లోనే తెరంగ్రేటం చేసింది. అలా ఆమె ఇప్పుడు అక్కడ బిజీ హీరోయిన్ గా మారింది. ఇక్కడ కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో పాటు తమిళ్ లో కూడా మేయ్ అనే సినిమా చేస్తోంది. వైద్య వ‌ృత్తిలో జరిగే అక్రమాలు ఇతివృత్తంగా తీసిన సినిమా ఇది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐశ్వర్య మాట్లాడుతూ సాధారణ జ్వరంతో ఆస్పత్రిలో చేరితే లక్ష రూపాయల బిల్లు వేశారని చెప్పుకొచ్చింది.

కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందని, ఎందుకయినా మంచిదని వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళానని పేర్కొంది. అయితే ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పిన సదరు ఆసుపత్రి యాజమాన్యం ఆమెను వార్డులో చేర్చారట. ఒకరోజు ఆసుపత్రిలోనే ఉన్న ఆమె డిశ్చార్జ్ చేయమని అడిగితే ఆదివారం దాకా ఆగాలని చెప్పారట. అప్పుడే తనకు కోపమొచ్చిందని, పద్ధతి కాదని తమాయించుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత బిల్లు చూస్తే మళ్ళీ జ్వరం వచ్చినట్టు అనిపించిందని ఎందుకంటే తనకు పరీక్షలు చేసినందుకు గాను లక్ష బిల్లు వేశారని ఆమె పేర్కొన్నారు. అన్ని టెస్ట్ లు చేసి మీది మామూలు జ్వరమే అని చెప్పి జ్వరం తగ్గడానికి వాడే డోలో మాత్రలు ఇచ్చారని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ఇక తప్పక బిల్లు కట్టానని ఐశ్వర్య వెచెప్పుకొచ్చింది.

టాలీవుడ్ హీరోయిన్… డోలో బిళ్ల‌కు ల‌క్ష బిల్ల‌ట‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts