ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ చేసిన నాగ్‌… బిగ్‌బాస్‌లో స‌రికొత్త రికార్డు

August 1, 2019 at 3:15 pm

సెన్సేషనల్‌ గేమ్‌ షో బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రతీ వార్త మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్‌కు సంబంధించి ఏ చిన్న న్యూస్ అయినా ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియా వాళ్ల‌కు పెద్ద పండ‌గే అయిపోయింది. తాజాగా తెలుగు బిగ్‌బాస్ – 3 సీజ‌న్ విజ‌య‌వంతంగా రెండోవారంలోకి ఎంట్రీ ఇస్తోంది. షో ప్రారంభానికి ముందు, ఆ త‌ర్వాత ఎన్నో వివాదాలు జ‌రుగుతున్నాయి. అయినా టీఆర్పీల విష‌యంలో పాత రికార్డుల‌కు పాత‌రేస్తూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

స్టార్ మా ఛానెల్లో ప్ర‌సారం అవుతోన్న‌ బిగ్‌బాస్‌ను ఇతర కార్యక్రమాలతో కన్నా ఎక్కువగా బిగ్‌ బాస్ గత సీజన్లతో మూడో సీజన్‌ను పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు. తాజా టీఆర్పీల ప్ర‌కారం ఈ షో హోస్ట్ నాగార్జున ఫ‌స్ట్ షోకు హోస్ట్‌గా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేశాడు. మూడో సీజన్‌ గత సీజన్ల కన్నా ఎక్కువగా ప్రజాద‌రణ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాగార్జున ఎన్టీఆర్‌, నానిల‌ను మించి కూడా ఆక‌ట్టుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్‌ రాగా – నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్‌ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగ్‌ తొలి ఎపిసోడ్‌కు 17.92 రేటింగ్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. జూలై 21న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే హేమ ఎలిమినేట్‌ కాగా, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. షో స్టార్టింగ్‌లోనే ఇలా ఉంటే షో ముగిసే స‌రికి ఈ షో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.

ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ చేసిన నాగ్‌… బిగ్‌బాస్‌లో స‌రికొత్త రికార్డు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts