కాజ‌ల్ గ్రేట్ అంటున్న యువ‌హీరో…!

August 19, 2019 at 2:24 pm

40ఏండ్ల ఓల్డ్ ఏజ్ నటిగా ఓ అంద‌మైన హీరోయిన్ న‌టించాలంటే ఎవ‌రు ముందుకు రారు.. కానీ కాజ‌ల్ మాత్రం సినిమా క‌థ న‌చ్చి మాత్ర‌మే ఒప్పుకున్నారు.. కాజ‌ల్ లాంటి గ్లామ‌ర‌స్ హీరోయిన్ ఇలాంటి న‌డివ‌య‌స్సు మ‌హిళ పాత్ర‌కు ఒప్పుకోవ‌డం గ్రేట్ అంటున్నాడు.. ఈ యువ హీరో… ఇంత‌కు ఆమే ఏసినిమాలో 40ఏండ్ల వ‌యస్సున్న పాత్ర ఒప్పుకుంది… కాజ‌ల్‌ను గ్రేట్ అంటున్న ఆ యువ‌హీరో ఎవ‌రు…?

ఇటీవ‌ల విడుద‌ల అయి విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతున్న చిత్రం రణ‌రంగం. ఈ సినిమాలో కాజ‌ల్‌కు ప్రాధాన్య‌త లేకున్నా కేవ‌లం పాత్ర‌లో ఉన్న స్కోప్‌, క‌థ న‌చ్చి ఆమే 40ఏండ్ల వ‌య‌స్సున్న పాత్ర‌ను చేసేందుకు ఒప్పుకుంద‌ని అంటున్నాడు హీరో శ‌ర్వానంద్‌. అయితే ఇంత‌కు ముందు కాజ‌ల్ కేవ‌లం పారితోషికం కోస‌మే ఈ పాత్ర‌కు ఒప్పుకుంద‌ని, అస‌లు అప్రాధాన్య‌త పాత్ర‌కు ఒప్పుకోవ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ విమ‌ర్శ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చాడు హీరో శ‌ర్వానంద్‌. వాస్త‌వానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ ర‌ణ‌రంగం సినిమాలో ఏలాంటి స్కోప్ లేకున్నా కేవ‌లం క‌థ న‌చ్చి సినిమా చేసింద‌ని శ‌ర్వా వివ‌రించాడు. సినిమాలో మాకు కాస్త ఊపిరి పీల్చుకునే స‌మయం కావాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. నా వ‌య‌స్సు పాత్ర‌కు స‌రిపోయే వ‌య‌స్సు ఉన్న పాత్ర అవ‌స‌ర‌మైంది. అయితే ఆ పాత్ర చేయ‌డానికి గ్లామ‌ర‌స్ హీరోయిన్ అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో కాజ‌ల్‌ను అడిగిన వెంట‌నే ఒప్పుకుంది.. అందుకే ఆమే గ్రేట్ అన్నాడు..హీరో శ‌ర్వానంద్‌…

కాజ‌ల్ గ్రేట్ అంటున్న యువ‌హీరో…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts