క‌ళ్యాణ్‌రామ్‌కు “ఆక్సీజ‌న్” అందేనా ?

August 24, 2019 at 5:17 pm

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ఎంత మంచివాడ‌వురా. ఈ చిత్రంను శ‌త‌మానం భ‌వ‌తి, శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రాల ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగ్నేష్ రూపొందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఓ ప‌ర‌భాష చిత్రం ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. క‌ళ్యాణ రామ్ న‌టిస్తున్న 17వ చిత్రంగా వ‌స్తున్న ఎంత‌మంచి వాడ‌వురా సినిమా ఆయ‌న కేరీర్‌కు ఆక్సీజ‌న్ అందిస్తుందా లేదా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎంత మంచి వాడ‌వురా అనే సినిమా ఓ ప్యామిలి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా గుజ‌రాతిలో వ‌చ్చిన ఆక్సీజ‌న్ సినిమాకు రీమేక్ అట‌. ద‌ర్శ‌కుడు ఈ సినిమాను ఉన్న‌దున్న‌ట్లుగా తెలుగులో సినిమాను రూపొందిస్తున్నాడు ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగ్నేష్‌.

గుజ‌రాతీ లో ఆక్సీజ‌న్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింద‌ట‌. తెలుగులో వ‌స్తున్న ఈ సినిమా మ‌రి నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌కు ఎంత‌టి ఆక్సీజ‌న్ అందిస్తుందో వేచిచూడాలి. క‌ళ్యాణ్‌రామ్ స‌ర‌స‌న మోహ‌రిన్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా, శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు.

క‌ళ్యాణ్‌రామ్‌కు “ఆక్సీజ‌న్” అందేనా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts