కిచ్చ సుదీప్ “పహిల్వాన్ ” ట్రైలర్

August 22, 2019 at 1:49 pm

శాండ‌ల్‌వుడ్ స్టార్ హీరో సుదీప్ సౌత్‌లో కిచ్చ సుదీప్‌గా బాగా పాపుల‌ర్ అయ్యాడు. సుదీప్ క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కే కాకుండా తెలుగు, త‌మిళ్ ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. సుదీప్ సినిమాలు సౌత్‌లో అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతెందుకు సుదీప్ తెలుగులో బాహుబ‌లి సినిమాలో చేసిన షేర్‌ఖాన్ క్యారెక్ట‌ర్ సూప‌ర్ హిట్ అయ్యింది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలోనూ ఓ సైన్యాధ్య‌క్షుడిగా సుదీప్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా క‌న్న‌డ‌లో సుదీప్ హీరోగా హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో ప‌హిల్వాన్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. వారాహి చల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సునీల్‌శెట్టి ఈ సినిమాలో సుదీప్ గురువుగా న‌టించాడు… నేను నీకు కుస్తీ ఎలా చేయాలో నేర్పించాను… నువ్వు ఎందుకు చేయాలో నేర్పించావు అన్న డైలాగ్ సినిమా క‌థేంటో చెప్పేస్తోంది. అదే టైంలో బ‌లం ఉంద‌ని కొడితే రౌడీ…. బ‌ల‌మైన కార‌ణంతో కొడితే యోధుడు అన్న డైలాగ్ సుదీప్ క్యారెక్ట‌ర్ చెపుతోంది.

సినిమాలో కుస్తీ నేప‌థ్యంతో పాటు ఎమోష‌న‌ల్‌కు కూడా బాగా ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. సుదీప్ స‌ర‌స‌న స్వ‌ప్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ట్రైల‌ర్ చివ‌ర‌న సెప్టెంబ‌ర్ 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఏదేమైనా ట్రైల‌ర్ బాగా అంచ‌నాలు పెంచేస్తోంది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో ? చూడాలి.

కిచ్చ సుదీప్ “పహిల్వాన్ ” ట్రైలర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts