ప్రిన్స్‌కు చెక్ పెట్టిన దిల్‌రాజు…!

August 24, 2019 at 6:16 pm

ప్రిన్స్ మ‌హేష్‌బాబుకు దిల్ రాజు చెక్ పెట్ట‌డా…? స‌రిలేరు నీకెవ్వ‌రు త‌రువాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప‌రిస్థితి ఏంటి అనేది అంతుచిక్క‌ని వ్య‌వ‌హారంగా మారింది. దిల్ రాజు మ‌హేష్‌బాబుకు చెక్‌పెట్ట‌డంతో మ‌రి మ‌హేష్‌బాబునే న‌మ్ముకున్న ఓ ద‌ర్శ‌కుడి ప‌రిస్థితి ఏంట‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.. ఇప్పుడు దిల్ రాజు, ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఇద్ద‌రి న‌డుమ ఓ యువ ద‌ర్శ‌కుడు చిక్కుకుని గిల‌గిలా కొట్టుకుంటున్నాడా…

ఇంత‌కు దిల్ రాజు ప్రిన్స్ కు ఎందుకు చెక్ పెట్టాడు.. ఇంత‌కు ఇద్ద‌రి న‌డుమ గిల‌గిల కొట్టుకుంటున్న ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు విష‌యం ఓసారి ప‌రిశీలిస్తే… స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమా నవంబ‌ర్ నెల‌తో షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేందుకు షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నారు.. అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు న‌వంబ‌ర్‌లో షూటింగ్ పూర్తి అయితే నెక్ట్స్ మ‌హేష్‌బాబు సినిమా ఏంటీ అనేది ప్ర‌శ్న‌.

అయితే ప్రిన్స్ మ‌హేష్‌బాబు కోసం ఇప్ప‌టికే దిల్ రాజు కోసం ఓ సినిమా క‌థ‌ను రెడి చేసి పెట్టాడ‌ట‌. మ‌హేష్‌బాబు కోసం వంశీ పైడిప‌ల్లి ఓ క‌థ‌ను రెడి చేయ‌డ‌మే కాకుండా ఆఫీసు చూసే ప‌నిలో కూడా ఉన్నార‌ట‌. ఇక మ‌హేష్ బాబు కోసం ప‌రుశ‌రామ్ మ‌రో క‌థ‌ను రెడి చేయ‌డ‌మే కాకుండా ఇప్ప‌టికే భీమిలిలో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసి పెట్టాడ‌ట‌. మ‌రి వంశీ పైడిప‌ల్లి సినిమా చేస్తే ప‌రుశ‌రామ్ ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ప్రిన్స్‌కు చెక్ పెట్టిన దిల్‌రాజు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts