కాశ్మీర్‌లో క్రికెట్ ఆడుతున్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు…!!

August 10, 2019 at 6:24 pm

ఆర్టిక‌ల్ 370ర‌ద్దుతో కాశ్మీర్‌లో 144 సెక్ష‌న్ విధించారు.. కాశ్మీర్ అంత‌టా ఇప్పుడు హైటెన్ష‌న్ నెల‌కొంది. జ‌మ్ము కాశ్మీర్ రెండుగా విభ‌జించిన అనంత‌రం అత‌లాకుత‌లం అవుతుండ‌గా మ‌న టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు మాత్రం ఆట‌లు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు… త‌ను ఒక్కడేనా అంటే అదేమి కాదండోయ్‌… త‌న‌కొడుకు గౌత‌మ్ తో క‌లిసి క్రికెట్ ఆడుతూ డైరెక్ట‌ర్ కెమెరాకు చిక్కాడు..

ఇంత టెన్ష‌న్ వాతావ‌ర‌ణంలో కూల్‌గా క్రికెట్ ఆడుతున్న మ‌హేష్‌బాబు, ఆయ‌న కొడుకు గౌతం, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఆడిన పోటోలు, వీడియ‌లు స‌రిలేరు నీకెవ్వ‌రు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేయ‌డం, అవి వైర‌ల్‌గా మారి మ‌హేష్‌బాబు అభిమానులను ఆనందంతో త‌డిసి ముద్ద‌వుతున్నారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ షెడ్యూల్ ని చిత్రబృందం బాగా ఎంజాయ్ చేసింది. విరామ సమయంలో అందరూ కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. మహేష్, గౌతమ్, వంశీ, మెహెర్ రమేష్ లతో సరదాగా గడిపినట్లు చెప్పారు.

మ‌హేష్‌బాబును గౌతం అవుట్ చేయ‌డంతో మ‌హేష్‌బాడు ఏడుస్తున్న‌ట్లు ఉన్న ఎమోజీల‌ను పోస్టు చేశాడు అనిల్ రావిపూడి. దీంతో వీడియో, ఎమోజీలు వైర‌ల్ అయి నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోల‌ను చూసిన మ‌హేష్‌బాబు అనిల్ రావిపూడికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఇందులో కొస‌మెరుపు ఏంటంటే స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర షెడ్యూల్ ఇప్పుడు హైద‌రాబాద్‌లో జ‌రుగుతుండ‌గా, ఈ సినిమా విరామంలో క్రికెట్ ఆడిన మ‌రో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కాశ్మీర్‌లో ఎందుకున్న‌ట్లు అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

కాశ్మీర్‌లో క్రికెట్ ఆడుతున్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts